రూ.12.50 లక్షల పంచాయతీ నిధులు గోల్‌మాల్‌

ABN , First Publish Date - 2021-11-13T06:27:08+05:30 IST

మండలంలోని కోనుప్పలపాడు గ్రామ పంచాయతీలో రూ.12.50 లక్షల నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం బట్టబయలైంది.

రూ.12.50 లక్షల పంచాయతీ నిధులు గోల్‌మాల్‌
కోనుప్పలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం

2019లో చేసిన పనికి మంజూరైన బిల్లు

కొత్త పనులకు చెల్లింపులతో తిరకాసు

కోనుప్పలపాడు పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యం


యాడికి, నవంబరు 12: మండలంలోని కోనుప్పలపాడు గ్రామ పంచాయతీలో రూ.12.50 లక్షల నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం బట్టబయలైంది. పంచాయతీ కార్యదర్శి నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారాజ్యంగా వ్యవ హరించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు మంజూరైన బిల్లు లను... తాజాగా పూర్తయిన సచివాలయ భవన నిర్మాణ పనులకు చెల్లించ డం దుమారం లేపుతోంది. 2019లో కోనుప్పలపాడు గ్రామ హైస్కూల్‌ ప్ర హరీగోడ నిర్మాణాన్ని చేపట్టారు. నిర్మాణం పూర్తయి ఏళ్లు గడిచాయి. ఎట్టకే లకు ఈ పనికి సంబంధించి రూ.12.50 లక్షల బిల్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా పంచాయతీ కార్యదర్శి సదరు కాంట్రా క్టర్‌కు ఈబిల్లు అందజేయకుండా మరో పనికి అనధికారికంగా చెల్లించాడు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్‌ బిల్లు కోసం పంచాయతీ అధికారులను ఆరా తీస్తూనే ఉన్నాడు. బిల్లులు రాలేదంటూ పంచాయతీ కార్యదర్శి కాలం వెళ్లబుచ్చుతూ వచ్చాడు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్‌ బిల్లుల కోసం ఉ న్నతాధికారులను సంప్రదించగా అసలు విషయం వెలుగచూసింది. బిల్లు లు మంజూరై చాలా రోజులైందని చెప్పడంతో కాంట్రాక్టర్‌, గ్రామస్థులు పంచాయతీ కార్యదర్శిని గట్టిగా నిలదీశారు.


మంజూరైన రూ.12.50లక్షలను వైసీపీ నాయకులు చేపట్టిన సచివాలయం, ఆర్బీకే నిర్మాణాలకు చెల్లింపు చేసినట్లు బయటపడింది. దీనిపై కాంట్రాక్టర్‌ ఎంపీడీఓ (ఎఫ్‌ఏసీ)కు ఫిర్యాదుచేశారు. ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి ఇద్దరు మంతనాలు జరుపుకొని డబ్బులు చెల్లించే విధంగా కాంట్రాక్టర్‌కు నచ్చజెప్పారు. వెంగన్నపల్లి గ్రామానికి చెందిన ఒక టీడీపీ నాయకుడి మధ్యవర్తిత్వం ద్వారా పంచాయ తీ కార్యదర్శి ఇప్పటివరకు రూ.5లక్షలు సొంత డబ్బులు చెల్లించినట్లు స మాచారం. మిగిలిన మొత్తం కోసం.. డబ్బులు తీసుకున్న వైసీపీ నాయకుల ను సంప్రదిస్తున్నారు. వారు మావద్ద ఇప్పుడు డబ్బులు లేవు.. సమయం కావాలని చెప్పడంతో ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులు పడ్డా రు. మధ్యవర్తి ద్వారా కాంట్రాక్టర్‌తో మంతనాలు జరిపి సమయం కావాల ని కోరగా, మధ్యవర్తి నాకు సంబంధం లేదని చేతులెత్తేయడంతో కాంట్రాక్టర్‌ వద్దకు ఎలా వెళ్లాలనే దానిపై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నా రు. నిధుల గోల్‌మాల్‌ వ్యవహారం మండల వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా పాత బిల్లులను వైసీపీ నాయకులకు ఇవ్వడంలో అధికారుల వారీగా పర్సెంటేజీ వాటాలు పంచుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈతతం గం నడుస్తుండగానే పంచాయతీ కార్యదర్శి డిప్యుటేషనపై అనంతపురం వెళ్లాడని కోనుప్పలపాడు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.


విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం:

అనిల్‌కుమార్‌, ఎంపీడీఓ (ఎఫ్‌ఏసీ) 

పంచాయతీ బిల్లుల గోల్‌మాల్‌ విషయంలో తనకు సంబంధం లేదు. ఒకరికి మంజూరైన బిల్లును వేరేవారికి పంచాయతీ కార్యదర్శి ఇచ్చారు. ఆ మొత్తం వసూలు చేసి ప్రహరీగోడ చేసిన కాంట్రాక్టర్‌కు ఇవ్వమని చె ప్పాం. విచారించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. 

Updated Date - 2021-11-13T06:27:08+05:30 IST