కరోనా పేషెంట్‌కు బెడ్ కావాలంటే 15 లక్షలు!

ABN , First Publish Date - 2021-07-23T11:36:28+05:30 IST

ప్రపంచంలో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతం కాలేదు. డెల్టా వేరియంట్ కారణంగా చాలా దేశాల్లో మరోసారి

కరోనా పేషెంట్‌కు బెడ్ కావాలంటే 15 లక్షలు!

పెరూ: ప్రపంచంలో కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా అంతం కాలేదు. డెల్టా వేరియంట్ కారణంగా చాలా దేశాల్లో మరోసారి ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని ఒక ఆస్పత్రిలోని సిబ్బంది అనుకున్నారు. అంతే కరోనాతో ఆస్పత్రికి వచ్చే వారికి బెడ్ కావాలంటే రూ.15 లక్షలు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ ఘటన పెరూలో వెలుగు చూసింది. కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు ఆస్పత్రిలో బెడ్ తప్పనిసరి. ఇలాంటి వారినే ఈ బృందం టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఒక్కొక్కరి వద్దూ 21వేల డాలర్లు అంటే మన లెక్కల్లో రూ.15.6 లక్షలపైగా వసూలు చేయడం అలవాటు చేసుకుంది. అది కూడా ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో ఇలా చేయడం గమనార్హం. ఒక కరోనా పేషెంట్‌కు బెడ్ కోసం వెళ్లగా 20,748 అమెరికా డాలర్లు అంటే రూ.15.4లక్షలపైగా చెల్లించాలని ఈ ముఠా కోరింది. దీంతో సదరు కరోనా పేషెంట్ సోదరుడు అధికారులను ఆశ్రయించాడు. అప్పుడగానీ ఈ స్కాం బయటపడలేదు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-23T11:36:28+05:30 IST