లక్ అంటే ఇదీ.. రెండేళ్ల గ్యాప్‌లో రెండు లాటరీలు గెలుచుకున్న మహిళ.. మొత్తం ఎంత గెలుచుకుందో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-06-13T02:22:28+05:30 IST

ఒక్కసారి లాటరీ తగిలడమే బహు అరుదు..! అందులోనూ కోట్లలో డబ్బు గెలుచుకోవడమంటే నిజంగానే అదృష్టం పట్టిందనుకోవాలి.

లక్ అంటే ఇదీ..  రెండేళ్ల గ్యాప్‌లో రెండు లాటరీలు గెలుచుకున్న మహిళ.. మొత్తం ఎంత గెలుచుకుందో తెలిస్తే..

ఎన్నారై డెస్క్: ఒక్కసారి లాటరీ తగిలడమే బహు అరుదు..! అందులోనూ కోట్లలో డబ్బు గెలుచుకోవడమంటే నిజంగానే అదృష్టం పట్టిందనుకోవాలి. కానీ.. రెండు సార్లు లాటరీ తగిలితే..? ప్రతి టిక్కెట్టు కనకవర్షం కురిపిస్తే..? ఏంటి ఇదంతా పగటికలా అని అనుకుంటున్నారా.. అస్సలు కాదు..! ఇది నిజంగానే జరిగింది. అమెరికాలోని ఓ మహిళ రెండేళ్ల వ్యవధిలో రెండు సార్ల జాక్ పాట్ కొట్టారు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ప్రతిసారీ కోటిన్నరకు తక్కువకాకుండా డబ్బు గెలుచుకున్నారు. 


దక్షిణ కరొలినా రాష్ట్రం కొలంబియా నగరానికి చెందిన ఓ మహిళ గత వారం లాటరీలో ఏకంగా 2 లక్షల డాలర్లు గెలుచుకుంది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది 1.5 కోట్లకు సమానం. స్థానికంగా ఉన్న  ఓ సూపర్ మార్కెట్‌లో కొన్న లాటరీ టిక్కెట్ ఆమెపై కనకవర్షం కురిపించింది. అయితే.. ఇదే సూపర్ మార్కెట్‌లో 2020లో కొన్న లాటరీ టిక్కెట్ కారణంగా ఆమె అప్పట్లో 2.5 లక్షల డాలర్లు(రూ.1.9 కోట్లు) గెలుచుకుంది.  ప్రస్తుతం ఈ వార్త స్థానికంగా పెద్ద సంచలనానికే దారి తీసింది. ‘‘అప్పట్లో గెలిచిన డబ్బుతో బాగా ఎంజాయ్ చేశా.. ఈసారి ఓ ఇల్లు కొనాలనుకుంటున్నా’’ అని ఆమె మీడియాకు తెలిపింది. దీంతో.. ఆమె అదృష్టం తెలుసుకున్న నెటిజన్లు కూడా విస్తూపోతూనే శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్  మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2022-06-13T02:22:28+05:30 IST