MK Stalin: రూ.20,000 కోట్లతో చెన్నైలో రెండో విమానాశ్రయం

ABN , First Publish Date - 2022-08-03T01:44:40+05:30 IST

తమిళనాడు రాజధాని చెన్నైలో రెండో విమానాశ్రయాన్ని నిర్మించనున్నట్టు..

MK Stalin: రూ.20,000 కోట్లతో చెన్నైలో రెండో విమానాశ్రయం

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో రెండో విమానాశ్రయాన్ని (Second Airport) నిర్మించనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ప్రకటించారు. 10 కోట్ల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యంతో రూ.20,000 కోట్ల అంచనా వ్యయంతో పరందూర్ వద్ద ఈ విమానాశ్రయం నిర్మిస్తామని అన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం కాగానే  కొత్త ఎయిర్‌పోర్ట్‌కు చెందిన ప్లాన్ ఎస్టిమేషన్ ఎంతనేది ఖరారవుతుందని అన్నారు. ప్రస్తుతానికి రూ.20,000 కోట్ల మేరకు ప్లాన్ ఎస్టిమేషన్ ఉందని ఒక ప్రకటనలో సీఎం తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ఈ ప్రాజెక్టు అమలు అనేది ఒక మైలురాయి అవుతుందని, డీఎంకే దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుందని చెప్పారు.


ప్రస్తుత విమానాశ్రయం వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 2.2 కోట్లుగా ఉందని, ప్రస్తుతం నడుస్తున్న విస్తరణ పనులు ఏడేళ్లలో పూర్తికాగానే ప్రయాణికుల సామర్థ్యం 3.5 కోట్లకు పెరుగుతుందని సీఎం తెలిపారు. పెరుగుతున్న ప్రయాణికులు, కార్గో పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వ అధీనంలోని టిడ్కో (TIDCO) సంస్థ విమానాశ్రయం కోసం భూమిని గుర్తించే పని చేపట్టిందని చెప్పారు. నాలుగు స్థలాలను ఎంపిక చేయగా, రెండింటికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిఫారసు చేసిందని, చివరకు పరందూర్‌ను ఫైనలేజ్ చేసిందని స్టాలిన్ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్ట్, ప్రతిపాదిత ఎయిర్‌పోర్ట్ కలిసి పనిచేస్తాయని చెప్పారు. త్వరలోనే స్థలం క్లియరెన్స్‌‌ ప్రతిపాదనను కేంద్రానికి పంపుతామని, స్క్రూటినీ పూర్తి కాగానే, భూసేకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - 2022-08-03T01:44:40+05:30 IST