లోక్‌సభ టికెట్‌కు రూ.5 కోట్లా!?

Sep 20 2021 @ 02:33AM

  • ఆర్జేడీ నేత తేజస్విపై ఎఫ్‌ఐఆర్‌ 
  • నమోదుకు పట్నా కోర్టు ఆదేశం 


పట్నా, సెప్టెంబరు 19: లోక్‌సభ టికెట్‌ ఇప్పిస్తామని మభ్యపెట్టి రూ.5 కోట్లు తీసుకున్నారన్న కేసు లో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పట్నా కోర్టు ఆదేశించింది. ఆయనతో పాటు ఆయన సోదరి మీసా భారతి, బిహార్‌ పీసీసీ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ ఝా, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రాజేశ్‌ రాథోడ్‌, సుభానంద్‌ ముఖేశ్‌లపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులకు కోర్టు సూచించింది.


2019 ఎన్నికల్లో భాగంగా భాగల్పూర్‌ లోక్‌సభ టికెట్‌ ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ఈ ఐదుగురు నేతలు తన నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారంటూ కాంగ్రెస్‌ నేత సంజీవ్‌ కుమార్‌ సింగ్‌ గత నెల 18న పట్నా కోర్టులో కేసు వేశారు. సొమ్ము తీసు కొని తనకు ఆ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వలేదని, అదేమంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఖాయమన్నారని వెల్లడించారు. ఆ ఎన్నికల్లోనూ తనకు టికెట్‌ రాలేదన్నారు. దీంతో ఈ ఐదుగురు నేతలపై సంజీవ్‌ కోర్టుకెక్కారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.