పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై రూ.10 తగ్గింపు

ABN , First Publish Date - 2021-11-04T06:04:55+05:30 IST

దీపావళి పండుగకు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు కానుక ఇచ్చింది. దీపావ ళి పండును పురస్కరించుకొని సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని లీటరు పెట్రోల్‌పై రూ.5లు, డీజిల్‌పై రూ. 10లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై రూ.10 తగ్గింపు

 అనంతపురం వ్యవసాయం, నవంబరు 3:  దీపావళి పండుగకు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు కానుక  ఇచ్చింది. దీపావ ళి పండును పురస్కరించుకొని సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని లీటరు పెట్రోల్‌పై రూ.5లు, డీజిల్‌పై రూ. 10లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. జిల్లాలో బుధవారం లీటరు పెట్రోల్‌ ధర రూ.116.27లు, డీజిల్‌ రూ.108.56లు ఉంది. కేంద్ర ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ తగ్గింపు ధరలు గురువారం డీల ర్లకు పంపనున్నారు. రాష్ట్రం వాటా కింద పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గిస్తే భారీగానే వాహనదారులకు ఉపశమనం కలుగనుంది.  రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయంపైనే సర్వత్రా చర్చ సాగుతోంది.  

Updated Date - 2021-11-04T06:04:55+05:30 IST