ltrScrptTheme3

కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు

Oct 27 2021 @ 00:55AM

అనంతపురం వైద్యం అక్టోబరు 26: కరోనాతో మరణించిన వారి కుటుంబానికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందించడానికి ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇం దుకోసం కలెక్టర్‌ చైర్మనగా కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తారు. అక్కడ మృతుల జాబితాను రూపొందించి, పరిహారం సొమ్ము రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధి కింద మంజూరు చేస్తారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్‌ కేటాయిస్తారు. దరఖాస్తు నమూనాను జిల్లా వైద్యశాఖ రూపొందిస్తుంది. దరఖాస్తు చేసుకున్న వారికి కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత రెండు వారాల్లోగా రూ.50 వేలు వారి బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేస్తారు. జిల్లాలో ఇప్పటికే అధికారికంగా 1093 మంది కరోనాతో మరణించారు. జిల్లా వైద్యాధికారి కామేశ్వరప్రసాద్‌ మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉందన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.