చిట్టీల పేరుతో రూ.5.50 కోట్ల ఎగవేత

ABN , First Publish Date - 2022-06-23T00:41:25+05:30 IST

Hyderabad: చిట్టీల పేరుతో కోట్ల రూపాయలను మోసం చేసిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ ప్రాంతానికి చెందిన

చిట్టీల పేరుతో రూ.5.50 కోట్ల ఎగవేత

Hyderabad: చిట్టీల పేరుతో కోట్ల రూపాయలను మోసం చేసిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అలియాబాద్ ప్రాంతానికి చెందిన మధు, అతని భార్య దివ్య ఆరు సంవత్సరాల నుంచి చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. ఈ మధ్య చిట్టీల కాలపరిమితి  పూర్తయినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో చిట్టీదారులు 11 నెలల క్రితం వారిపై శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు సీసీఎస్‌కు బదిలీ కావడంతో దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు తమ అవసరాల కోసం మధు వద్ద చిట్టీలు వేశారు. రూ. 50 వేల నుంచి రూ.5 లక్షల చిట్టీలు వేశామని బాధితులు తెలిపారు. సుమారు 70 మంది నుంచి రూ 5.50 కోట్లు దండుకునట్లు  సమాచారం. తమకు న్యాయం చేయాలని చిట్టీదారులు పోలీసులను కోరుతున్నారు. 

Updated Date - 2022-06-23T00:41:25+05:30 IST