రహదారుల అభివృద్ధికి రూ.6.88 కోట్లు మంజూరు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-01-24T04:36:51+05:30 IST

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని ప్రధానమైన 12 రహదారుల మరమ్మతుకు ప్రభుత్వం రూ.6.88 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు.

రహదారుల అభివృద్ధికి రూ.6.88 కోట్లు మంజూరు : ఎమ్మెల్యే

నారాయణఖేడ్‌, జనవరి 23 : నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని ప్రధానమైన 12 రహదారుల మరమ్మతుకు ప్రభుత్వం రూ.6.88 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని మొత్తం 27.52 కిలోమీటర్లరహదారులను అభివృద్ధి చేయడం కోసం ఈ నిధులను మంజూరు చేశారన్నారు. జాతీయ రహదారి 161బీ నుంచి దోసపల్లి వరకు 1.67 కిలోమీటర్ల రోడ్డుకు రూ.43.5 లక్షలు, పంచగామ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రాణాపూర్‌ మీదుగా ముగ్దుంపూర్‌ వరకు 8.05 కిలోమీటర్ల రోడ్డుకు రూ.కోటి 95 లక్షల 75 వేలు, జాతీయ రహదారి నుంచి మాయికోడ్‌ మీదుగా రాణాపూర్‌ మీదుగా 1.35 కిలోమీటర్ల రోడ్డుకు రూ.కోటి 9 లక్షల 25 వేలు, జాతీయ రహదారి నుంచి బెల్లాపూర్‌ మీదుగా బాదల్‌గాంకు 1.98 కిలోమీటర్ల రోడ్డుకు రూ.32 లక్షల 72 వేలు, కర్‌సగుత్తి నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రెండు కిలోమీటర్ల రోడ్డుకు రూ.40 లక్షలు, కర్‌సగుత్తి రోడ్డు నుంచి పూసల్‌పాడ్‌ వరకు 0.68 కిలోమీటర్ల రోడ్డుకు రూ.13.20 లక్షలు, కర్‌సగుత్తి నుంచి గోప్యానాయక్‌తండా వరకు 2.16 కిలోమీటర్ల రోడ్డుకు రూ.37.24 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుండి రాసోల్‌ ముర్కుంజాల్‌ రోడ్డుకు 4.30 కిలోమీటర్లకు, రూ.కోటి 10 లక్షలు, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కొత్తపేట్‌ వరకు 3.36 కిలోమీటర్ల రోడ్డుకు రూ.67 లక్షలు, శివాయిపల్లి వరకు 0.41 కిలో మీటర్ల రోడ్డుకు రూ.8 లక్షలు, ఉత్తులూరు వరకు 0.71 కిలో మీటర్ల రోడ్డుకు రూ.14 లక్షలు, వీరోచిపల్లితండా వరకు 0.85 కిలో మీటర్ల రోడ్డుకు రూ.17 లక్షలు మంజూరయ్యాయన్నారు. నిధులను మంజూరు చేయించినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి దయాకర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-01-24T04:36:51+05:30 IST