ltrScrptTheme3

రేవంత్, కేటీఆర్ ఛాలెంజులు మాకెందుకు: ఆర్ఎస్ ప్రవీణ్

Sep 26 2021 @ 22:36PM

జగిత్యాల: తమకు వైట్ ఛాలెంజులు, బ్లాక్ ఛాలెంజులు వద్దని, బ్లూ ఛాలెంజ్ కావాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. బహుజన జైత్రయాత్ర సభలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో బ్లూ జెండా ఎగరేస్తామన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఛాలెంజులు తమకెందుకని ప్రశ్నించారు. ‘‘బంగారు చీరలు మీకు, బతుకమ్మ చీరెలు మాకా.. కట్ట కింద భూములు మీవి, కన్నీళ్లు, కష్టాలు మావా?. ఏనుగు ఎక్కి జగిత్యాల నుంచి సిరిసిల్ల మీదుగా ప్రగతి భవన్ వెళతాం. రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర రావడం లేదు. జగిత్యాలలో జైత్రయాత్ర రోజులు మళ్ళీ కనిపిస్తున్నాయి. బిడ్డా పాత రోజులు పోయినయ్.’’ అని ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరించారు. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.