గల్ఫ్‌లో తొలిసారిగా దళిత బహుజన సభ

ABN , First Publish Date - 2022-08-04T21:49:21+05:30 IST

విదేశీగడ్డపై తొలిసారిగా తెలంగాణ దళితులు దుబాయిలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మెళనం అలాయి బలాయిను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రవాసీయులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

గల్ఫ్‌లో తొలిసారిగా దళిత బహుజన సభ

ప్రవీణ్ కుమార్ రాక, చురుగ్గా ఏర్పాట్లు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విదేశీగడ్డపై తొలిసారిగా తెలంగాణ దళితులు దుబాయిలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మెళనం అలాయి బలాయిను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి ప్రవాసీయులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని విద్యాధికులైన దళిత బహుజనులను క్రమేపి ఆకర్షిస్తున్న బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్. ప్రవీణ్ కుమార్ ఇక విదేశాలలో ఉంటున్న ఈ వర్గపు ప్రవాసీయులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్, అమెరికా దేశాలలో ఉంటున్న దళిత బహుజన యువతలో కూడా ప్రవీణ్ కుమార్ పై ప్రత్యేక అభిమానం ఉంది. ప్రవీణ్ కుమార్ ఈ నెల 15 నుండి అమెరికాలో నెల రోజుల పాటు పర్యటించనున్నారు. అమెరికాకు వెళ్తూ మార్గమధ్యంలో దుబాయిలో.. అంతకు ఒక రోజు ముందు గల్ఫ్ ప్రవాసీయుల ఆత్మీయ సమ్మేళనం – అలాయి బలాయిలో పాల్గోనున్నారు. దుబాయిలోని అల్ ఖోజ్‌లో డలస్కో మీటింగ్ హాలులో ఈ నెల 14న మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశాన్ని నిర్వహించననున్నట్లుగా నిర్వహకులు చాకలి వెంకట్, మహతి రమేశ్‌లు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశ వివరాలను 971544231053, 971557533811 పోన్ నంబర్లపై  సంప్రదించవచ్చు.

Updated Date - 2022-08-04T21:49:21+05:30 IST