సోషల్‌ మీడియాలో చూసి సాయం చేశారు..!

ABN , First Publish Date - 2021-04-18T05:00:51+05:30 IST

పట్టణంలోని బీసీ కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న ఆయా రతిదేవి కుటుంబానికి ప్యాపిలి హైస్కూల్‌ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుపతిలో రిజర్వుడు ఎస్‌ఐగా పనిచేస్తున్న శివక్రిష్ణ లింగాధర్‌ రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు.

సోషల్‌ మీడియాలో చూసి సాయం చేశారు..!

ప్యాపిలి, ఏప్రిల్‌ 17: పట్టణంలోని బీసీ కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న ఆయా రతిదేవి కుటుంబానికి ప్యాపిలి హైస్కూల్‌ పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తిరుపతిలో రిజర్వుడు ఎస్‌ఐగా పనిచేస్తున్న శివక్రిష్ణ లింగాధర్‌ రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మార్సీ కార్యాలయంలో కాంట్రాక్టు ఆయాగా పనిచేస్తున్న రతిదేవికి భర్త 8ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లతో పాటు తల్లిదండ్రులను కూడా ఆమె చూసుకుంటోంది. అయితే ఎమ్మార్సీ కార్యాలయం నుంచి ఆరు నెలలుగా జీతాలు రాలేదు. తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో యూటీఎఫ్‌ నాయ కులు లతీఫ్‌, నరసింహురెడ్డి స్పందించి సంఘం ద్వారా చందాలు వసూళ్లు చేసి ఇటీవల ఆ పేద కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించారు. దీనిని సోషల్‌ మీడియాలో చూసిన శివక్రిష్ణ లింగాధర్‌ స్పందించారు. వెంటనే మండలంలోని ఎన్‌.రంగాపురం గ్రామంలో ఉంటున్న తన సోదరుడు ఉమేష్‌కు ఆన్‌లైన్‌ ద్వారా రూ.10వేలు పంపారు. ఈ మేరకు శనివారం యూటీఎఫ్‌ నాయకులు లతీఫ్‌, ఉమేష్‌ రతిదేవి కుటుంబానికి నగదును అందజేశారు.

Updated Date - 2021-04-18T05:00:51+05:30 IST