Advertisement

ఇక ఇంటి నుంచే ఆర్టీఏ సేవలు

Sep 21 2020 @ 01:41AM

ఇప్పటికే పలుసేవలను  ఆన్‌లైన్‌లో అందిస్తున్న ఆర్టీఏ

అందుబాటులోకి మరో ఆరు రకాల సేవలు

కార్యాలయానికి వెళ్లకుండానే పనులు

తప్పనున్న దళారుల బెడద

ఉమ్మడి జిల్లాలో ఆరు ఆర్‌టీఏ కార్యాలయాలు


కామారెడ్డి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): 

కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తున్న నేప థ్యంలో పలు ప్రభుత్వ విభాగాలలో ఆన్‌లైన్‌ సేవలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖలో సైతం ఆ న్‌లైన్‌ సేవలను విస్త్రత పరచడానికి నిర్ణయించింది. ఈ సేవలను రవాణా కార్యాలయాలకు రాకుండానే ఇంటి వ ద్ద నుంచే అందించేందుకు ఆ శాఖ శ్రీకారం చుట్టింది. ఇ ప్పటికే రెండు నెలల క్రితం ఐదు సేవలను ఆన్‌లైన్‌ చేసి న ప్రభుత్వం.. తాజాగా మరో ఆరు సేవలను పూర్తిస్థా యిలో ఆన్‌లైన్‌ చేశారు. దీంతో రవాణా శాఖ కార్యాల యాలకు రాకుండానే స్మార్ట్‌ఫోన్‌ లేదా మీ-సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని సేవలను పొందే వెసులుబాటును కల్పించింది. రవాణా శాఖలో వాహనదారులకు మొత్తం 59 సేవలను అందిస్తున్నారు. టీయాప్‌ ఫోలియో ద్వారా ఈ సేవలను పొందే అవకాశం వినియోగదారులకు కల్పి ంచారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూ ర్‌, సాలూర చెక్‌పోస్ట్‌, కామారెడ్డి, బాన్సువాడతో కలుపు కొని మొత్తం ఆరు ఆర్‌టీఏ కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల్లో ప్రతిరోజు 90 నుంచి 120 వరకు వా హన రిజిస్ట్రేషన్‌లు అవుతున్నాయి.


తాజాగా మరో 6 సేవలు ఆన్‌లైన్‌లో

కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రభుత్వం ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు అందించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే ఆ న్‌లైన్‌లో గత జూన్‌ 24 నుంచి 5 సేవలను రవాణా శా ఖ అందిస్తుండగా తాజాగా మరో 6 సేవలను చేర్చించిం ది. రవాణా శాఖలో ఉన్న 70 ప్రజాసంబంధ వ్యవహారా ల ద్వారా సేవలను అందిస్తున్నారు. కానీ ఉమ్మడి జిల్లా లో ఆర్‌టీఏ కార్యాలయాల నుంచి 59 సర్వీస్‌లు అందు బాటులో ఉన్నాయి. వాస్తవానికి ఆర్‌టీఏ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థను రూపుమాపడానికి 2009 నుంచే కం ప్యూటరైజ్‌డ్‌ నెట్‌వర్క్‌ సిస్టంకు ప్రాథమికంగా శ్రీకారం చుట్టారు. 2015 నుంచి రవాణా సేవ లను అందించడానికి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం ప్రారంభించారు. వాహ నాల రిజిస్ట్రేషన్‌ తదితర సేవలకు స్లాట్‌ బుకింగ్‌ ప్రారంభించారు. ఆన్‌లైన్‌లో కాకుండా ఈ-సేవ కేంద్రాల్లో కూడా కుకింగ్‌, జరిమానా లు, చలానాల చెల్లింపును చేపట్టారు. కాగా కరోనా నేప థ్యంలో కార్యాలయానికే రాకుండా పూర్తిస్థాయిలో తాజా గా తెచ్చిన ఆరు సేవలతో కలిపి మొత్తం పదకొండింటిని ఇంటివద్ద నుంచే పొందే సదుపాయాన్ని కల్పించారు.

 

ఆన్‌లైన్‌ సేవలు ఇవే

కోత్తగా మరో ఆరు సేవలను ఆన్‌లైన్‌కు అనుసంధాని స్తూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది.వీటిలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణ, అడ్రస్‌ మార్పు, ప్రమాదకర వస్తు వులను తరలించే వాహనాల లైసెన్స్‌ తీసు కోవడం, గడు వు ముగిసిన ల ర్నింగ్‌ లైసెన్స్‌ స్థా నంలో కొత్తది తీసుకో వడం వాహన కేటగిరీ మారినప్పుడు కొత్త లర్ని ంగ్‌ లైసెన్స్‌ పొందడం, డ్రై వింగ్‌ లైసెన్స్‌ గడువు తీరిపో తే మళ్లీ లైసెన్స్‌ జారీలాంటి సౌ కర్యాలను ఆన్‌లైన్‌లో పొందవ చ్చు. ఏజెంట్ల ప్రమేయం లేకుండా, గంటల తరబడి రవాణా కార్యాలయ ంలో నిరీక్షించాల్సిన అవసరం లేకుండా వివిధ సేవలను ఆన్‌లైన్‌ ద్వారా పొందే సదుపాయాన్ని కల్పించారు. దరఖాస్తు దా రుడు కోరుకున్న సేవలకు సంబంధించి పూర్తి వివరాలు సక్రమంగా ఉంటే రవాణా శాఖ ఆ ప నిని పూర్తి చేసి డాక్యుమెంట్లను కూడా ఇంటికే పోస్ట్‌ ద్వారా పంపించే ఏర్పాట్లు చేసింది. దీంతో విని యోగదారులకు పనులు సులువుగా కానున్నాయి. 


వాహనదారులు వినియోగించుకోవాలి..వాణి, ఆర్డీఏ అధికారి, కామారెడ్డి

రవాణా శాఖలో ఆన్‌లైన్‌ సేవలు విస్త్రత పరచడంలో భా గంగా దశల వారీగా సేవలను పూర్తిస్థాయిలో ఇంటి వద్ద నుంచే పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించగా.. తాజాగా మరో ఆరు సేవలను సైతం చేర్చుతూ అనుమతించింది. వ్యవస్థలో సములమార్పు లకు శ్రీకారం చుడుతూ త్వరలోనే పూర్తిస్థాయి ఆన్‌లైన్‌ సేవలను అందు బాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అక్రమాల కు తావులేకుండా ఉండడానికి ఆన్‌లైన్‌ సేవలు వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతాయి. జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడలలో ఆర్‌టీఏ కార్యాల యాలు ఉన్నాయి. ప్రతీ రోజు 90 వరకు రిజిస్ట్రేషన్‌లు అవుతాయి. ప్రస్తుతం జిల్లా రవాణా శాఖలో 59 సేవలు అందుబాటులో ఉన్నాయి. వాహనదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

Follow Us on:
Advertisement
Advertisement