
డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన గండం
పెదపారుపూడి : అదుపు తప్పి ఆర్టీసీ బస్సు పంటకాల్వలోకి దూసుకెళ్లిన సంఘటన మండలంలోని వెంట్రప్రగడ - కలవపాముల పొలిమేర వద్ద చోటు చేసుకుంది. గుడివాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెంట్రప్రగడ పొలిమేర వద్దకు వెళ్లే సరికి స్టీరింగ్ ఫెయిలవ్వటంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. కొంత మంది ప్రయాణాలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108లో గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు దోసపాడు చానల్‌లో బోల్తా పడితే చాలా మంది చనిపోయేవారని, డ్రైవర్ సమయ స్ఫూర్తి వల్లే గండం తప్పిందని తెలిపారు. పొలాల్లో పనులు చేసుకుంటున్న కూలీలు చేరుకొని ప్రయాణికులను బయటికి తరలించారు.