ఆర్టీసీ మళ్లీ బాదుడు

ABN , First Publish Date - 2022-07-01T05:27:40+05:30 IST

ఆర్టీసీ బస్సు టిక్కెట్ల ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఆర్టీసీ చార్జీలను పెంచాల్సి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా ఈ ఏడాదిలో రెండోసారి ఆర్టీసీ ధరలు పెంచడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా ధరల భారం మోపుతోందని వాపోతున్నారు.

ఆర్టీసీ మళ్లీ బాదుడు

 డీజిల్‌ సెస్‌ పేరిట బస్‌ చార్జీల మోత...
 నేటి నుంచే అమలు
(శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి)

ఆర్టీసీ బస్సు టిక్కెట్ల ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఆర్టీసీ చార్జీలను పెంచాల్సి వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో శ్రీకాకుళం -1, శ్రీకాకుళం - 2, టెక్కలి, పలాస ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 349 బస్సులు ఉన్నాయి. ప్రతిరోజు 1.33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుంటాయి. వీటి ద్వారా రోజుకి రూ.45లక్షల నుంచి రూ.50లక్షలు వరకు ఆర్టీసీకి ఆదాయం చేకూరుతుంది. తాజాగా పెంచిన ధరలతో మరింత ఆదాయం సమకూరనుంది. కాగా ఈ ఏడాదిలో రెండోసారి ఆర్టీసీ ధరలు పెంచడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా ధరల భారం మోపుతోందని వాపోతున్నారు.

 బస్సుల్లో కనీస ధరలిలా...
పల్లెవెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస చార్జీ రూ.10, అలా్ట్ర పల్లెవెలుగులో రూ.10, ఎక్స్‌ప్రెస్‌లో రూ.20, అలా్ట్ర డీలక్స్‌లో రూ.25, సూపర్‌ లగ్జరీలో రూ.40, ఇంద్ర రూ.50, గరుడ రూ.50, అమరావతి రూ.50, నైట్‌ రైడర్‌ సీట్‌ రూ.50 చొప్పున కనీస చార్జీలు ఉన్నాయి. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస చార్జీ రూ.10గానే ఉంచారు. తొలి 30 కిలోమీటర్ల వరకు సెస్‌ పెంచలేదు. 35 నుంచి 60 కిలోమీటర్ల వరకు అదనంగా రూ.5 సెస్‌ విధించారు. 65 నుంచి 70 కిలోమీటర్ల వరకు రూ.10, 75 నుంచి 95 కిలోమీటర్ల వరకు రూ.15, 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు రూ.20  చొప్పున అదనంగా సెస్‌ పెంచేశారు. అలా్ట్ర పల్లెవెలుగు బస్సుల్లో మాత్రం 115 నుంచి 120 కిలోమీటర్ల వరకు రూ.25 పెంచారు. ఎక్స్‌ప్రెస్‌ల్లో... 31 నుంచి 65 కిలోమీటర్ల వరకు రూ.5, 66 నుంచి 85కిలోమీటర్ల వరకు రూ.10, 86 నుంచి 125కి.మీ. వరకు రూ.15 చొప్పున పెంచారు. ఆపై పది, ఇరవై కిలోమీటర్లకు అదనంగా రూ.5, రూ.10 చొప్పున వసూలు చేయనున్నారు.  శ్రీకాకుళం నుంచి అటు విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం.. పాలకొండ మీదుగా ఇటువైపు పార్వతీపుం నిత్యం జిల్లా ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. పెరిగిన ధరలు రీత్యా.. శ్రీకాకుళం నుంచి విజయవాడకు ప్రస్తుత టిక్కెట్‌ ధర కన్నా రూ. 80 వరకు అదనంగా పెరగనుంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు రూ.15 నుంచి రూ. 20వరకు ఎక్స్‌ప్రెస్‌, గరుడ బస్సుల టిక్కెట్‌ ధరలు పెరగనున్నాయి. అలాగే శ్రీకాకుళం నుంచి విజయనగరం వరకు రూ. 10 నుంచి రూ. 15వరకు ధర పెరగనుంది. పార్వతీపురం వరకు రూ.15 నుంచి రూ. 20వరకు అదనపు భారం పడనుంది.


Updated Date - 2022-07-01T05:27:40+05:30 IST