డిపాజిట్‌ లేకుండానే అద్దెకు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2021-10-24T05:48:14+05:30 IST

ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఆ సంస్థ చైర్మన్‌, ఎండీ సరికొత్త పథకాలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే సామాన్య ప్రజలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండానే పెళ్లిళ్లు, ఇతర వేడుకలు, దూర ప్రాంతాల టూర్‌లకు, బృందాలుగా వెళ్లేందుకు ముందస్తుగా బస్సులను బుక్‌చేసుకునే అవకాశాన్ని కల్పించారు.

డిపాజిట్‌ లేకుండానే అద్దెకు ఆర్టీసీ బస్సులు

పెళ్లిళ్లు, వేడుకలకు ముందస్తుగా బస్సులు బుక్‌చేసుకునే అవకాశం

పికప్‌, డ్రాప్‌ పద్ధతిలో కిలో మీటర్లను బట్టి డబ్బులు వసూలు

సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్‌ఎం

సుభాష్‌నగర్‌, అక్టోబరు 23: ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఆ సంస్థ చైర్మన్‌, ఎండీ సరికొత్త పథకాలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే సామాన్య ప్రజలకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా సెక్యూరిటీ డిపాజిట్‌ లేకుండానే పెళ్లిళ్లు, ఇతర వేడుకలు, దూర ప్రాంతాల టూర్‌లకు, బృందాలుగా వెళ్లేందుకు ముందస్తుగా బస్సులను బుక్‌చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సజ్జన్నార్‌ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్టీసీ నిజామాబాద్‌ ప్రాంతీయ అధికారి సుధాపరిమిళ తెలిపారు. ఇందులో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో 200ల కి.మీ.ల వరకు పికప్‌, డ్రాప్‌ పద్ధతిలో ఎటువంటి అడ్వాన్స్‌ లేకుండా మామూలు చార్జీలకు ఒకటిన్నర రేటు చార్జిలో తక్షణమే సమయానుసారం బస్సు ఇవ్వడం జరుగుతుందన్నారు. 200ల కి.మీ.ల కంటే ఎక్కువ దూరం వెళ్లేవారు పల్లెవెలుగు బస్సుకు 1.5 రేటు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు మామూలు చార్జీలతో ఎటువంటి అడ్వాన్స్‌లేకుండా బస్సులు ముందస్తుగా బుక్‌చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. సూపర్‌లగ్జరీ బస్సులను కనీసం 300కి.మీ.లు, రాజధాని బస్సులు 400ల కి.మీ.లు ఉంటే ఎటువంటి అడ్వాన్స్‌ లేకు ండా బస్సులను అందివ్వనున్నామన్నారు. సంస్థ కల్పించిన ఈ అవకాశాన్ని ఉమ్మడి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని చౌక, సురక్షితమైన ప్రయాణంతో వేడుకలకు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. వివరాలకు డిపో మేనేజర్‌ ఆర్మూర్‌-9959226019, బోధన్‌- 9959226001, నిజామాబాద్‌ 1-9959226016, డిపో-2 9959226017, కామారెడ్డి-9959226019, బాన్సువాడ-9959226020 నంబర్‌లను సంప్రదించాలన్నారు.

Updated Date - 2021-10-24T05:48:14+05:30 IST