మెదక్: హైదరాబాద్ నుంచి బాన్సువాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు చక్రం ఊడిపోయింది. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నారు. ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు.