కొవిడ్‌ బాబోయ్‌!

ABN , First Publish Date - 2021-04-18T06:23:44+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో, రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగులు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలను నిలిపేయాలని డిమాండ్‌ చేస్తున్నా రు.

కొవిడ్‌ బాబోయ్‌!

బ్రీత్‌ ఎనలైజర్లు ఆపేయండి! 

ఆర్టీసీలో మళ్లీ మొదలైన వివాదం 

కొనసాగింపునకే అధికారుల నిర్ణయం 

ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత 

విజయవాడ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో, రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో ఉద్యోగులు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలను నిలిపేయాలని డిమాండ్‌ చేస్తున్నా రు. కరోనా తగ్గుముఖం పట్టినప్పుడు తాము సహకరించామని, సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరం గా ఉండటంతో తొలగించాలని డిమాండ్‌ చేస్తు న్నారు. కృష్ణా రీజియన్‌లో వారం రోజులుగా డిపోల వద్ద ఈ అంశంపై సిబ్బందికి, అధికా రులకు వాగ్వాదాలు నడుస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు కూడా రంగంలోకి దిగి కొంతకాలం ఈపరీక్షలను నిలిపివేయాలని కోరుతున్నాయి. అధికారులు మాత్రం కొనసాగించేందుకే మొగ్గు చూపించారు. దీంతో వివాదాలు తగ్గట్లేదు. సిబ్బంది ప్రతిరోజూ డ్యూటీలకు వెళ్లేటపుడు ఆల్కహాల్‌ సేవించి వచ్చారా అన్న విషయం తెలుసుకోవటానికి బ్రీత్‌ ఎనలైజింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. దీనిద్వారా స్ర్టా ఎవరికి వారికి మార్చినా ఒకరు ఊదిన గాలి లోపలికి పోయి వస్తుంది కాబట్టి సర్ఫేజ్‌పై లాలాజల బిందువులు, గాలిలోని తేమ ఉంటుందన్నది ఉద్యోగుల వాదన. మరో ఉద్యోగి స్ర్టాను మార్చినా సర్ఫేజ్‌పై ఉన్న వైర్‌సను స్వీకరించే ప్రమాదం ఉందని వాదిస్తున్నాయి. మొదటిదశలో కరోనా తీవ్రత తగ్గేవరకు ఎలా నిలిపేశారో, ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టేవరకు అలాగే చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుత సెకండ్‌ వేవ్‌లో ఎక్కువగా కొవిడ్‌ బారిన పడే ప్రమాదం ఉందని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఎండీ ఆర్‌పీ ఠాకూర్‌కు ఈ మేరకు లేఖ రాశారు. బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌లను తక్షణం నిలుపుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బస్సుల్లో డ్యూటీలు చేస్తున్న సిబ్బందితో పాటు, గ్యారేజ్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి కాపాడేందుకు బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్ట్‌లను నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-18T06:23:44+05:30 IST