డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన

ABN , First Publish Date - 2021-06-17T05:01:15+05:30 IST

జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.

డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు నిరసన
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

 కందనూలు, జూన్‌ 16 : జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని  ఆ ర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నాగర్‌కర్నూలు ఆర్టీసీ డిపో ముందు నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం, యాజమాన్యం తమకు జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తోందని  వాపోయారు. గత నెల జీ తాలు ఇంతవరకు ఇవ్వకపోవడంతో ఇంటిఅద్దెలు కట్టలేక, బ్యాంకుల్లో నెలవారీ కిస్తీలు, కిరాణం బిల్లులు నిలిచిపోయారని ఆందోళన చెందారు. వెంటనే జీతాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. 

జీవో ప్రకారం మునిసిపల్‌ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి

కందనూలు :  పీఆర్సీ కమిషన్‌ సిఫారసు చేసిన జీవో నెంబరు 60ప్రకారం మునిసిపల్‌ కార్మికులకు వేతనాలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయం ముందు బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో మునిసిపల్‌ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందు వరుసలో నిలబడి ప్రజలకు సేవ చేశారన్నారు. అటువంటి వారికి తక్షణమే జీవో అమలు చేయాలని డి మాండ్‌ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, కుర్మయ్య, రామస్వామి, భవాని, వెంకటయ్య, భూదేవి, ఎల్లమ్మ, శంకరమ్మ, ఆలివేల ఉన్నారు. 


Updated Date - 2021-06-17T05:01:15+05:30 IST