ఉమ్మడి ఖమ్మం జిల్లాలో.. ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ. 1.04కోట్లు

ABN , First Publish Date - 2021-01-22T05:10:09+05:30 IST

ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపినందుకు ఆర్టీసీకి ఒక కోటీ నాలుగు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..  ఆర్టీసీ సంక్రాంతి ఆదాయం రూ. 1.04కోట్లు

గత ఏడాదికన్నా రూ.55 లక్షలు తక్కువ

ప్రగతిచక్రంపై  కరోనా ప్రభావం

ఖమ్మం సాంస్కృతికం, జనవరి 21: ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపినందుకు ఆర్టీసీకి ఒక కోటీ నాలుగు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈనెల 8వ తేదీ నుంచి 19వ తేదీ నుంచి 19వ తేదీవరకు సుమారు 500 ప్రత్యేక బస్సుల్ని నడిపారు. గత ఏడాదితో పోల్చితే రూ. 55 లక్షల ఆదాయం ఈసారి తగ్గింది. గత ఏడాది 824 బస్సుల్ని నడపగా కోటీ 59 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. కరోనా ప్రభావం ఈఏడాది పండుగ సీజన్‌లోను ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. ఈఏడాది అత్యధికంగా ఖమ్మం డిపోకు రూ.26 లక్షల ఆదాయం రాగా అతి తక్కువ ఆదాయం మధిర డిపోకు 9లక్షల 50వేలరూపాయల ఆదాయం వచ్చింది. భద్రాచలం రూ.24 లక్షలు, కొత్తగూడెం రూ.18లక్షలు, సత్తుపల్లి రూ. 15 లక్షలు, మణుగూరు రూ.11 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఖమ్మం డిపోకు రూ.38లక్షలు, మధిరకు రూ.19 లక్షలు, సత్తుపల్లి రూ. 37 లక్షలు, కొత్తగూడెం రూ.20 లక్షలు, భద్రాచలం రూ.43 లక్షలు, మణుగూరు రూ.19 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది.  


Updated Date - 2021-01-22T05:10:09+05:30 IST