మెరుగైన సేవలకే ప్రథమ ప్రాథాన్యం

Jul 23 2021 @ 00:27AM
ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రసంశాపత్రాలు అందజేస్తున్న ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారాకా తిరుమలరావు, తదితరులు

ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు

నరసరావుపేట టౌన్‌, జూలై 22: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రథమ ప్రాఽథాన్యం ఇవ్వాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. నరసరావుపేటలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆయన గురువారం పరీశీలించారు. అనంతర గ్యారేజిలో జరిగిన సమావేశం మాట్లాడుతూ ఉద్యోగులు కేఎంపీఎల్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. డ్రైవర్లందరు ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపాలన్నారు.  ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిశీలనలో ఉన్నాయని, ఆందోళన అవసరం లేదని, త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. కేఎంపీఎల్‌ సాధించిన డ్రైవర్ల, కండెక్టర్లు, ఇతర ఉద్యోగులకు ప్రసంశా పత్రాలు అందజేశారు. బస్టాండ్‌ సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో అపరేషన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ బ్రహ్మానందరెడ్డి, కృష్ణమోహన్‌, డీఎం షేక్‌ అబ్దుల్‌ సలామ్‌, ఇతర డిపోల మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.