ట్రిపుల్‌ఐటీలో ఆర్టీసీ ప్రత్యేక టికెట్‌ కౌంటర్‌

Published: Mon, 16 May 2022 00:00:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ట్రిపుల్‌ఐటీలో ఆర్టీసీ ప్రత్యేక టికెట్‌ కౌంటర్‌టికెట్లను జారీ చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

వేంపల్లె, మే 16: ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ లో తరగతులకు ఈ నెల 19 నుంచి సెలవు లు ప్రకటించడంతో విద్యార్థులు తమ స్వగ్రా మాలకు వెళ్లేందుకు వీలుగా ఆ రోజు నుంచి ఆర్టీసీ ట్రిపుల్‌ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు పులివెం దుల డీఎం ఉమామహేశ్వరరెడ్డి  నిర్ణయించారు. విద్యార్థు లు నేరుగా టికెట్లు బుక్‌ చేసుకునేందుకు వీలుగా ట్రిపుల్‌ ఐటీలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ కుళ్లాయ ప్ప, ట్రాఫిక్‌ ఇనస్పెక్టర్‌ సూర్యనారాయణ ఆ ధ్వర్యంలో డీఎంఈ జీఎఎన రావు, రాజశేఖర్‌ రెడ్డి విద్యార్థులకు టికెట్లను అందించారు. సెలవులున్న ప్రతిసారి  ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.