బిడ్డ కోసం తల్లిదండ్రుల నిరీక్షణ

ABN , First Publish Date - 2022-03-06T16:57:25+05:30 IST

వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన రాయచూరు జిల్లా విద్యార్థిని రుబీనా శనివారం ఉదయం ఢిల్లీకి చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడమేగాక ఆనందం వ్యక్తం చేశారు.

బిడ్డ కోసం తల్లిదండ్రుల నిరీక్షణ

                          - ఢిల్లీకి చేరిన రాయచూరు విద్యార్థిని రుబీనా


రాయచూరు(కర్ణాటక): వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు వెళ్లిన రాయచూరు జిల్లా విద్యార్థిని రుబీనా శనివారం ఉదయం ఢిల్లీకి చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకోవడమేగాక ఆనందం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం ఏంబీబీఎస్‌ చదివేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లిన రుబీనా ఇటీవల రష్యా దాడుల నేపథ్యంలో బంకర్‌లో తలదాచుకున్నారు. రుబీనా తలదాచుకున్న బంకర్‌లోనే కర్ణాటకకు చెందిన నవీన్‌ కూడా ఉన్నారు. అతడు ఆహారం కోసం బయటికి వెళ్లి రష్యా బలగాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో రుబీనా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రుబీనా తండ్రి హుసేన్‌ బాష, తల్లి జుబేదా బేగం ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. తమ బిడ్డ కోసం వారు గత వారం రోజులుగా తీవ్ర ఆందోళనతో నిరీక్షిస్తున్నారు. ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి తమ బిడ్డను రక్షించాలంటు వేడుకోవడం కనిపించింది. పోలాండ్‌ గూండా శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నట్లు సమాచారం తెలుసుకున్న వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-03-06T16:57:25+05:30 IST