‘స్టార్‌ మా’లో ‘రుద్రమదేవి’

ABN , First Publish Date - 2021-01-17T06:20:53+05:30 IST

తెలుగు స్టార్‌ మా’ ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న

‘స్టార్‌ మా’లో ‘రుద్రమదేవి’

తెలుగు స్టార్‌ మా’ ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న రాణి రుద్రమ్మ కథను ‘రుద్రమదేవి’ టైటిల్‌తో ధారావాహికగా తెలుగు ప్రేక్షకుల  ముందుకు తీసుకురానున్నారు. స్ర్టెయిట్‌ తెలుగు సీరియల్‌గా, ఓ దృశ్యకావ్యంలా రూపు దిద్దుకున్న ‘రుద్రమదేవి’ ధారావాహిక కథాకాలాన్ని, యథాతథంగా చిత్రీకరించేందుకు వందల మంది ఎంతగానో కషి చేస్తున్నారు. ఉన్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు దీక్షగా పనిచేస్తున్నారు. జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్‌ ప్రసారమవుతుంది.  

Updated Date - 2021-01-17T06:20:53+05:30 IST