తన రిలేషన్ స్టేటస్ ఏంటో చెప్పిన ‘కృష్ణార్జున యుద్ధం’ హీరోయిన్

Published: Fri, 21 Jan 2022 17:46:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తన రిలేషన్ స్టేటస్ ఏంటో చెప్పిన కృష్ణార్జున యుద్ధం హీరోయిన్

‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఏబీసీడీ’ వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన నటి రుక్సార్ థిల్లాన్. తాజాగా ఆమె విష్వక్ సేన్ సరసన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో నటిస్తోంది. ఆమె ఈ మధ్య మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. తన రిలేషన్ షిప్ స్టేటస్ ఏంటో వివరించింది. తనకు ప్రేమ,పెళ్లి‌పై కొన్ని వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నయాని ఆమె తెలిపింది. 


గతంలో రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ఆమె పేర్కొంది. ‘‘ప్రేమ వివాహాంపై నాకు నమ్మకముంది. పెళ్లి చేసుకొబోయే వ్యక్తి గురించి నేను పూర్తి వివరాలు తెలుసుకోవాలి. జీవితాంతం అతడితో కలిసి జీవించాలి. అందువల్ల పెళ్లికి ముందే అతడితో కొంత సమయం వెచ్చించాలి’’ అని రుక్సార్ థిల్లాన్ తెలిపింది. ఆమె లండన్‌లో జన్మించింది. బెంగళూరులో స్థిరపడింది. ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.  ‘ఆకతాయి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International