పెళ్లయిన కొద్ది రోజులకే పారిపోతున్న యువతులు! భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న ఘటనలు! కారణం తెలిస్తే..

ABN , First Publish Date - 2021-10-18T04:07:55+05:30 IST

పెళ్లయిన కొద్ది రోజులకే పారిపోతున్న యువతులు! భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న ఘటనలు! కారణం తెలిస్తే..

పెళ్లయిన కొద్ది రోజులకే పారిపోతున్న యువతులు! భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న ఘటనలు! కారణం తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అంగరంగ వైభవంగా జరిగిన వివాహం.. కొడుకు ఓ ఇంటివాడయ్యాడన్న సంబరంలో తల్లిదండ్రులు. కొడుకూ కోడలిని చూసి తెగ మురిసిపోతుంటారు. కోడలూ కూడా ఇందుకు తగ్గట్టే ప్రవర్తిస్తుంది. సభ్యత, సంస్కారం, వినయం విధేయతలను తూకం వేసినట్టు సమపాళ్లలో ప్రదర్శిస్తూ వారి మతి పోగొడుతుంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని అంతా అనుకుంటున్న తరుణంలో..ఆమె వారందరికీ మస్కా ఇచ్చి పారిపోతుంది. పోతూ పోతూ ఇంట్లోని డబ్బంతా దోచుకుపోతుంది.


పెళ్లి చేసుకోవడం..పది పదిహేను రోజులు కాపురం చేయడం..సమయం చూసి ఇంట్లో వారందరికీ మత్తు మందు ఇచ్చి.. డబ్బంతా దోచుకుపోవడం. ఇదీ ఈ నవవధువుల తంతు..! రాజస్థాన్‌లో గత ఆరు నెలల్లోనే ఇటువంటి కేసులు 80కి పైగా వెలుగులోకి వచ్చాయి.


దీని వెనుక పెద్ద సంఖ్యలో దళారులు, ముఠాలు ఉన్నాయని అక్కడి పోలీసులు చెబుతున్నారు. బాధితులు భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ ఫిర్యాదు చేసే వారి సంఖ్య మాత్రం పదుల సంఖ్యలోనే ఉంటుందని చెబుతున్నారు. రాజస్థాన్‌లో స్త్రీ-పురుష జనాభా నిష్ఫత్తిలో అంతరం పెరిగి.. యువతులకు కొరత ఏర్పడినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసేకునేందుకు అమ్మాయిలు దొరక్క అనేక మంది యువకులు బేజారైపోతున్నారు.సరిగ్గా ఇటువంటి వారినే ఈ ముఠాలు టార్కెట్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, బెంగాల్‌లో పేద కుటుంబాలకు చెందిన యువతులను దళారులు రంగంలోకి దింపుతారు. 


వారిని రాజస్థాన్‌కు రప్పించి.. పెళ్లి కోసం నిరీక్షిస్తున్న వారికిచ్చి వివాహం జరిపిస్తారు. పెళ్లయిన కొద్ది రోజులకు ఆ యువతి అత్తారికి మస్కా కొట్టి డబ్బుతో బయటకు వచ్చేస్తుంది. దళారులేమో ఆ డబ్బులోంచి తమ వాటా పుచ్చుకుంటారు. బాగా డబ్బు ముడుతుందనే ఆశతో పెళ్లైన మహిళలు కూడా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారట. అయితే మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే బదులు మళ్లీ  దళారులనే సంప్రదిస్తున్నారట. పోయిన డబ్బును కుదిరినంత వెనక్కు తెచ్చుకుని మిన్నకుండిపోతున్నారు. సమాజంలో పరువు పోతుందనే భయంతో వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదట. రాజీ కుదరని పక్షంలో మాత్రమే బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Updated Date - 2021-10-18T04:07:55+05:30 IST