16న సికింద్రాబాద్‌లో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం

ABN , First Publish Date - 2022-04-14T23:48:48+05:30 IST

కాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ సంఘాలన్ని సమైక్యంగా కలిసి క్రీస్తుకు శిలువ వేయడం, క్రీస్తు పునరుత్థానం వంటి అంశాల ప్రాధాన్యతను తెలియజేప్పేందుకు ప్రతి యేటా నిర్వహించే

16న సికింద్రాబాద్‌లో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం

కాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ సంఘాలన్ని సమైక్యంగా కలిసి క్రీస్తుకు శిలువ వేయడం, క్రీస్తు పునరుత్థానం వంటి అంశాల ప్రాధాన్యతను తెలియజేప్పేందుకు ప్రతి యేటా నిర్వహించే ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేది శనివారం ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ సెంట్ మేరీ బసిలికా గ్రౌండ్ వద్ద నిర్వహిస్తున్నట్లు రన్ ఫర్ జీసస్ కో-ఆర్డినేటర్ పాల్ దేవప్రియం పుల్లా (ఆరాధన టీవీ నిర్వహకులు) తాజాగా వెల్లడించారు. సంస్థ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోస్టర్‌ని మరియు టీ షర్ట్స్‌ని ఆవిష్కరించారు. 


ఈ సందర్భంగా పాల్ దేవప్రియం పుల్లా మాట్లాడుతూ.. ఈ రన్‌ను ప్రతి సంవత్సరం పవిత్ర శనివారం నాడు అంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండేల నడుమ.. ప్రభువు క్రీస్తును శిలువ మరియు పునరుత్థాన సందేశం వివరించడం కోసమే ఈ ర్యాలీ నిర్వహిసున్నాము. ఇది ఒక క్రీడాస్పూర్తి గల వేదిక. 2011వ సంవత్సరంలో కేవలం 30 ప్రాంతాలలో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం.. నేడు విస్తరించి 350 పైగా ప్రాంతాల్లో, దక్షిణ భారతదేశ వ్యాప్తంగా, ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చెన్నై మరియు విదేశాలలోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, డాక్టర్. పూల అంథోనీ, డాక్టర్. ఏ.సి. సొలొమాన్ రాజ్, బిషప్ డాక్టర్. ఎమ్.ఏ డానియల్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభిస్తారు.. అని తెలిపారు.

Updated Date - 2022-04-14T23:48:48+05:30 IST