పరుగు, జీవితం ఒక్కటే.. సాగిపోవాలి

ABN , First Publish Date - 2022-08-19T05:29:43+05:30 IST

పరుగు, జీవితం రెండు ఒక్కటేనని, ముందుకు సాగిపోవాలి కానీ, ఆగిపోకూడదని పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బందితో చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గురువారం 5కే రన్‌ను నిర్వహించగా సీపీ జెండా ఊపి ప్రారంభించారు.

పరుగు, జీవితం ఒక్కటే.. సాగిపోవాలి
రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు కట్టపై జెండా ఊపి 5 కే రన్‌ను ప్రారంభిస్తున్న పోలీసు కమిషనర్‌ శ్వేత

పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత


చిన్నకోడూరు, ఆగస్టు 18 : పరుగు, జీవితం రెండు ఒక్కటేనని, ముందుకు సాగిపోవాలి కానీ, ఆగిపోకూడదని పోలీసు కమిషనర్‌ ఎన్‌.శ్వేత పేర్కొన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లాలోని పోలీస్‌ అధికారులు, సిబ్బందితో చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌ శివారులోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు కట్టపై గురువారం 5కే రన్‌ను నిర్వహించగా సీపీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ ఎవరి ఆరోగ్యం వారి చేతిలో ఉంటుందని, మెడిసిన్‌కు దూరంగా ఉండాలంటే వాకింగ్‌, రన్నింగ్‌, యోగా చేయాలన్నారు. మితమైన ఆహారం తీసుకోవాలని, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. అనంతరం 5కే రన్‌లో పాల్గొన్న పోలీస్‌ అధికారులకు, సిబ్బందికి ఆమె స్టీల్‌ వాటర్‌ బాటిల్స్‌ అందజేసి, అభినందనలు తెలిపారు. 5కే రన్‌లో మొదటి మూడు స్థానాల్లో ఏఆర్‌ కానిస్టేబుళ్లు టి.నవీన్‌, వి.భాస్కర్‌, సీహెచ్‌.సతీ్‌ష నిలిచారు. మహిళా విభాగంలో మొదటిస్థానంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె.లావణ్య, రెండోస్థానంలో మహిళ ఆర్‌ఎ్‌సఐ పుష్ప నిలిచారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీలు రామచందర్‌రావు, సుభాష్‌ చంద్రబోస్‌, ఏసీపీ దేవారెడ్డి, ట్రాఫిక్‌ ఏసీపీ ఫణీందర్‌, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు, హుస్నాబాద్‌ సీఐ రఘుపతిరెడ్డి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పోలీస్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


సిద్దిపేటలో ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నా : సీపీ

సిద్దిపేటలో ఉద్యోగం చేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నానని పోలీస్‌ కమిషనర్‌ శ్వేత అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పోలీసు ఉద్యోగులకు ఫ్రీడమ్‌ కప్‌ పేరిట సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పలు క్రీడాపోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు గురువారం జడ్పీ చైర్‌పర్సన్‌ రోజారాధాకృష్ణశర్మ, అదనపు కలెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ మహేందర్‌, ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి సీపీ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం కోసం రోజుకు 30 నిమిషాలు తప్పకుండా నడవాలని సూచించారు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి నడక చాలా ముఖ్యమన్నారు.  రోజు 30 నిమిషాలు నడిస్తే ఎవరు కూడా ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం ఉండదని సూచించారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. సిద్దిపేటకు వచ్చిన వారు ఎవరు వదిలి వెళ్లాలని కోరుకోరని, అంత మంచి వాతావరణం ఉంటుందని తెలిపారు. 


పీజీ కాలేజీ విద్యార్థుల ఫ్రీడం వాక్‌

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్దిపేట పట్టణంలోని ఓయూ పీజీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం ఫ్రీడం వాక్‌ను నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది జాతీయ జెండాలతో ప్రదర్శన చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. కళాశాల ప్రాంగణం నుంచి ప్రారంభమైన ర్యాలీ ముస్తాబాద్‌ చౌరస్తా మీదుగా గద్ద బొమ్మ విగ్రహం వరకు, అక్కడి నుంచి కళాశాల వరకు సాగింది. ఈ కార్యక్రమంలో కళాశాల కో ఆర్డినేటర్‌ డా.రామ్మోహన్‌రావు, సూపరింటెండెంట్‌ వెంకట్‌రావు, సహాయ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-19T05:29:43+05:30 IST