Saudi Arabia: యజమాని అనుమతి లేకుండా Runaway status ను మార్చుకునే అవకాశం

ABN , First Publish Date - 2022-06-25T15:23:46+05:30 IST

ఓ సంస్థలో లేదా ఒక యజమాని వద్ద పనిచేసే ప్రవాస ఉద్యోగులపై జారీ చేసిన రన్‌అవే స్థితి (Runaway status)ని వారి అనుమతి లేకుండా రద్దు చేసుకోవడానికి సౌదీ అరేబియా మానవవనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ (MHRSD) అవకాశం కల్పించింది.

Saudi Arabia: యజమాని అనుమతి లేకుండా Runaway status ను మార్చుకునే అవకాశం

రియాద్: ఓ సంస్థలో లేదా ఒక యజమాని వద్ద పనిచేసే ప్రవాస ఉద్యోగులపై జారీ చేసిన రన్‌అవే స్థితి (Runaway status)ని వారి అనుమతి లేకుండా రద్దు చేసుకోవడానికి సౌదీ అరేబియా మానవవనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వశాఖ (MHRSD) అవకాశం కల్పించింది. ఈ మేరకు అధికారికంగా సర్క్యూలర్ జారీ చేసింది. అయితే, దీనికి కొన్ని షరతులు పూర్తి చేసిన తర్వాతే రద్దు ప్రక్రియను చేపట్టవచ్చని కార్మిక వ్యవహారాల డిప్యూటీ మంత్రి అబ్దుల్ మజీద్ అల్-రషూదీ వెల్లడించారు.


Runaway నోఫికేషన్‌ను ఈ కింది విధంగా క్యాన్సిల్ చేసుకోవచ్చు..

1. యజమాని కల్పించే సదుపాయ స్థితి ఉనికిలో లేదు  అని చూపబడినట్లతే.

2. సదుపాయాల స్థితి ప్రాసెస్‌లో ఉందని పేర్కొన్నప్పుడు. అలాగే యజమాని సౌకర్యం కోసం సంబంధిత ఫైల్ వ్యవధి విధించిన తేదీ నుంచి 30 రోజుల దాకా ఉన్నట్లయితే. 

3. యజమాని సదుపాయాల స్థితి రెడ్ జోన్‌లో ఉన్న సందర్భంలో 75 శాతం కంటే తక్కువ కాకుండా తన కింద పనిచేసే కార్మికుల ఒప్పందాలను డాక్యుమెంట్ చేయడానికి కట్టుబడి ఉండకపోతే. 

4. యజమాని సదుపాయాల స్థితి రెడ్ జోన్ ఉండి, దాని మొత్తం శ్రామిక శక్తిలో 80శాతం కార్మికుల వేతనాలను రక్షించడానికి కట్టుబడి ఉండకపోతే.


వీటితో పాటు కార్మికుడి సేవలను బదిలీ చేయాలనుకునే సంస్థలు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను కూడా సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

1. కార్మికుడి సేవలను వేరే వారికి బదిలీ చేయాలనుకునే యజమాని సంబంధిత రుసుములు భరించాలి. అలాగే యజమాని లేదా సంస్థలు తప్పనిసరిగా ఈ-సర్టిఫైడ్ లెటర్‌ను జారీ చేయాలి. 

2. జీఓ 4/11/1440హెచ్ ప్రకారం కార్మిక చట్టంలోని ఆర్టికల్ 15కు సంబంధించిన రెండో నియమంలో పేర్కొన్న విధంగా కార్మికుడిని బదిలీ చేసే విధానాలను పూర్తి చేయడానికి అవసరమైన నియమ నిబంధనలను సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. 


Updated Date - 2022-06-25T15:23:46+05:30 IST