జల్లికట్టు ఎద్దు మృతి

ABN , First Publish Date - 2021-01-22T12:50:08+05:30 IST

జల్లికట్టు పోటీలో తన సత్తా చాటి ఎన్నో బహుమతులు గెల్చుకున్న ఎద్దు అనారోగ్యం కారణంగా మృతిచెందడం గ్రామస్తుల్లో విషాదం నింపింది. తిరుపత్తూర్‌ జిల్లా...

జల్లికట్టు ఎద్దు మృతి

చెన్నై/వాషర్‌మెన్‌పేట (ఆంధ్రజ్యోతి): జల్లికట్టు పోటీలో తన సత్తా చాటి ఎన్నో బహుమతులు గెల్చుకున్న ఎద్దు అనారోగ్యం కారణంగా మృతిచెందడం గ్రామస్తుల్లో విషాదం నింపింది. తిరుపత్తూర్‌ జిల్లా ఆలంగాయం సమీపంలోని కావలూరు ప్రాంతానికి చెందిన అన్నామలై షన్ముగతోపు అనే ఎద్దును సంరక్షిస్తున్నాడు. ఎంతో ప్రేమగా పెంచిన ఆ ఎద్దుకు జల్లికట్టు పోటీలకు శిక్షణ ఇచ్చాడు. ఇప్పటివరకు జరిగిన జల్లికట్టు పోటీల్లో షన్ముగతోపు పాల్గొని ఆరుసార్లు ప్రథమ బహుమతులు గెలుచుకుంది. ఇదిలా ఉండగా, ఈ నెల 14న ఆనైకడి ప్రాంతంలో జరిగిన పోటీలకు అన్నామలై తన ఎద్దును తీసుకెళ్లాడు. అదుపుతప్పిన ఓ మినీ వ్యాన్‌ ఎద్దును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా దానికి వైద్యులు ఏడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. బుధవారం రాత్రి చికిత్స ఫలించక షన్ముగతోపు మృతిచెందింది. తమ గ్రామానికి గౌరవం చేకూర్చిన ఎద్దు మృతి చెందడంతో గ్రామస్తులు గురువారం ఎద్దుకు అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2021-01-22T12:50:08+05:30 IST