Viral Video: క్యాప్సికం కాయల్లో డబ్బులే డబ్బులు.. ఇదేం వింత అని అంతా ఆశ్చర్యపోయే లోపే..

ABN , First Publish Date - 2021-10-24T17:21:38+05:30 IST

ఈ వీడియో చూస్తే..

Viral Video: క్యాప్సికం కాయల్లో డబ్బులే డబ్బులు.. ఇదేం వింత అని అంతా ఆశ్చర్యపోయే లోపే..

ఇంటర్‌నెట్‌డెస్క్: ఈ వీడియో చూస్తే.. ‘‘ఇదేందయ్యా ఇది.. ఇది నేను చూడలా..’’ అంటారేమో..! ఎందుకంటే ఈ వీడియోలో చెట్లకు డబ్బులు కాయడం చూస్తాము.. అదేంది చెట్లకు డబ్బులు కాయడమా..? తమాషా చేస్తున్నారా లేక ఆటపట్టిస్తున్నారా..? అని అనుకోవచ్చు.. నిజమండి బాబూ.. ఒకతను చెట్లకు డబ్బులు కాస్తాయని ఓ వీడియోను ఇన్‌‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇది చూసి మనమందరం షాక్‌కు గురవుతామని అతడి ఫీలింగ్. కానీ మనమేం అంతా తెలివితక్కువోళ్లం కాదు కదా.. చెట్లకే డబ్బులు కాస్తాయని తెలుస్తే.. మనం ఇన్ని రోజులు ఊరికనే ఉంటామా..? అతడికంటే ముందే అలాంటి చెట్లను పండించేవాళ్లం కదా..! ఇక అసలు విషయానికొస్తే..



ఓ వ్యక్తి ఫేమస్ కావడానికి ఓ వీడియో తీశాడు. అదేంటంటే.. తన పెరట్లో ఉన్న క్యాప్సికం కాయలను తుంచగా రూపాయి బిళ్లలు కిందకు పడేలా చూపిస్తాడు. అలాగే మరో రెండు క్యాప్సికం కాయలను కట్ చేస్తే.. అందులోనుంచి కూడా రూపాయి బిళ్లలు వచ్చేలా చూపిస్తాడు. మొదట్లో మనం కూడా ‘‘అరే.. ఏంట్రా ఇది..’’ అని అనుకుంటాం. కానీ చెట్లకు డబ్బులు కాయవని మనందరికీ తెలిసిన విషయమే. అయితే అతను ఇక్కడ ఓ ట్రిక్‌ను ఉపయోగించినట్టు ఉన్నాడు. ముందుగానే క్యాప్సికం కాయలలో రూపాయి నాణేములను ఉంచి.. ఆ తర్వాత ఆ కాయలను గమ్‌తో అతికించి ఉంటాడు. అదంతా మనకు వీడియోలో చూపించడు. కేవలం క్యాప్సికం కాయలను తుంచి.. రూపాయి బిళ్లలు కిందకు పడేలా చూపిస్తాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ఏంటో మీరూ చూసేయండి.



Updated Date - 2021-10-24T17:21:38+05:30 IST