పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-05-13T06:38:35+05:30 IST

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
విత్తనాలను చల్లుతున్న మంత్రి అల్లోల

విగ్రహ ప్రతిష్ఠాపనలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

సారంగాపూర్‌, మే 12 : పల్లెల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం మం డలంలోని ఆలూర్‌లో బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, సమగ్ర శిశు మహిళా అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషక ఉద్యానవనంలో ‘మన అంగన్‌వాడీలు - మన ఆకుకూరలు’ అనే కార్యక్రమంలో భాగంగా పల్లె ప్రకృతి వనంలో ఆకుకూర విత్తనాలను వేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రయోగాత్మకంగా ఈ వనంలో కార్య క్రమాన్ని చేపట్టడంతో రకరకాల ఆకు కూరలు, కూరగాయలు పండించడం జరుగుతుందన్నారు. పండించిన కూరగాయలను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేయడంతో పాటు అంగన్‌వాడీ విద్యార్థులకు ఆకుకూరలతో భోజ నాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో సాగు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం రూ. 12 లక్షలతో దేవాదాయ శాఖ నిధులతో నూతనంగా నిర్మించిన పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం తేమ శాతం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్‌ రెడ్డి, సర్పంచ్‌ రాధా సాయికృష్ణ, నాయకులు మాధవ్‌ రావు, రాజ్‌ మహ్మద్‌, శ్రీనివాస్‌ రెడ్డి, లింగారెడ్డిలతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు. 

Read more