పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-10-26T04:50:13+05:30 IST

మండ లాలలో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను వెం టనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదే శించారు.

పల్లె ప్రకృతి వనాలను వెంటనే పూర్తి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావ్‌

- వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వెంకట్రావ్‌

- ప్రజావాణి, ధరణికి 69 ఫిర్యాదులు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 25: మండ లాలలో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను వెం టనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఆదే శించారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తహసీ ల్దార్లు, ఎంపీడీవోలతో  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలె క్టర్‌ మాట్లాడారు.  హరితహారం, నర్సరీలతోపాటు ఐ దు, పది ఎకరాలలో చేపట్టిన బృహత్‌ పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని, ఉపాధి హామీ పథకం కింద జాబ్‌ కార్డులు అవసరమైన వారందరికీ ఇవ్వా లని, ఉపాధి హామీ పథకం కింద  కందకాలను త వ్వించాలని, ఈ నెల 31 నాటికి వైకుంఠధామాల ని ర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. వ్యాక్సినేషన్‌ జిల్లాలో 64శాతం పూర్తి చేశామని, వందశాతం పూర్తి చేసేం దుకు  ప్రతీ ఉద్యోగి కృషి చేయాలన్నారు. అధికారులు గ్రామాలను విభజించుకొని అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎం, ఆశలు ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ వేసేలా  చర్యలు తీ సుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు  అటవీ భూముల పరిరక్షణలో భాగంగా గ్రామ, మండల, జిల్లాస్థాయిల్లో కమిటీలు వేస్తామని,  అడవులను పరి రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తె లిపారు. ప్రజావాణి కార్యక్రమానికి ధరణిప్రజావాణి కి 50, సాధారణప్రజావాణికి 19ఫిర్యాదులు వచ్చా యి.  అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్ట ర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ మాట్లాడుతూ గతవారం ప్రజావాణి, వాట్సాప్‌ కాల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల వివరాలు ఆరాతీశారు. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల ను గతవారమే పరిష్కరించడంపై ఆయా శాఖల అధికారులను అభినందించారు.   

సాయంత్రంలోగా కార్యాలయాల వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వండి

ప్రభత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి భవనం, ఖాళీ స్థలం ఎంత ఉంది, సర్వేనెంబర్‌ ఎంత, తదితర వివరాలను సాయంత్రంలోగా పంపించాలని స్థానిక సంస్థల అ దనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశించారు.  ఇదివరకు కొన్ని డిపార్‌మెంట్లు వివరాలు పంపారు, కాని, పూర్తిస్థాయిలో లేవన్నారు. తిరిగి మరోసారి పరి శీలించి పూర్తిస్థాయిలో జాబితాను అందించాలని కో రారు. ఈ విషయాన్ని ప్రతీ అధికారి సీరియస్‌గా తీ సుకోవాలని సూచించారు. అనంతరం శాఖల వారీగా అమలు చేస్తున్న పథకాలపై ఆరా తీశారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, జడ్పీ సీఈ వో జ్యోతి, డీఆర్‌డీవో యాదయ్య పాల్గొన్నారు.

యాసంగిలో వరి పంట వేయొద్దు

మహబూబ్‌నగర్‌టౌన్‌: యాసంగి పంటగా వరిని వేయొద్దని   కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు కోరారు. సోమవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని స మావేశ మందిరంలో అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశమ య్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వరి వేయడం వల్ల వచ్చే నష్టాలు, ఇబ్బందులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వరికి బదులుగా ఇతర పంటలు వేసేందుకు రైతులను ప్రోత్సహించాలని అన్నారు. భారత ఆహార సంస్థ నిబంధనల ప్రకారం పారా బాయిల్డ్‌ రైస్‌ కొనే అవకాశాలు లేనందున దీని ప్రభావం వరి రైతులపై ఎక్కువగా పడేందుకు అవకాశం ఉం దని, అంతేకాక వరి వేయడం వల్ల కలిగే నష్టాలు, మార్కెట్‌ లేకపోవడం, చీడపీ డలను దృష్టిలో ఉంచుకొని యాసంగిలో జిల్లా రైతులు వరి పంట వేయకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, ఈ విషయంపై గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు. వరికి బదులుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం శనగలు, మినుములు, నువ్వులు, ఆముదాలు, ఆవాలు, పొద్దుతిరుగుడు, కుసుమలు, వంటి పంటలు వేసుకునేలా నచ్చ చెప్పాలని తె లిపారు. డీలర్లు కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వరికి బదులుగా ఇతర 12 రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి అమ్మాలని కోరారు. ఎవరైనా డీలర్లు వరి విత్తనాలు తెచ్చి అమ్మినట్లయితే అలాంటి వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ సీతారామారావు, జిల్లా వ్యవసాయ అధికారిణి సుచరిత, డీఆర్‌డీవో యాదయ్య, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ జగదీష్‌, డీఎస్‌వో వనజాత, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:50:13+05:30 IST