పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి

Jun 16 2021 @ 23:35PM
వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పాల్గొన్న కలెక్టర్‌ శశాంక, అధికారులు

 రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కరీంనగర్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, స్థానిక సంస్థల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించిందని రాష్ట్ర పంచా యతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, సీజనల్‌ వ్యాధుల నివారణ తదితర అంశాలపై సీఎస్‌, ఉన్నతాధికారులు బుధవారం జిల్లా కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికా రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రి వరంగల్‌ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలు, పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గ్రామాల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తడిచెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించాలని, దీనిపై ఇంటిం టికి అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. పచ్చదనం పెంపొందించడం కోసం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ చాలా కీలకమని, మొక్కల సంరక్షణ నివేది కను సిద్ధం చేసుకోవాలని, దీని కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో వైకుంఠ ధామాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేసి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని, వైకుంఠ ధామాలకు మొక్కలతో కూడిన గ్రీన్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని, ఎత్తైన పూల మొక్కలు నాటా లని మంత్రి సూచించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అధికారులు సమన్వయ సమావేశాలు నిర్వహించుకొని సీజనల్‌ వ్యాధులు నియంత్రిం చడానికి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఉన్నతాధికారులు గ్రామాలను నిరంతరం పర్యవేక్షిం చాలని, పల్లె నిద్ర నిర్వహించి గ్రామాల సమస్యలు తెలుసుకోవాలని మంత్రి సూచించారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం వంటి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో ఆశించిన మేర పురోగతి సాధిచడానికి సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రగతిభవన్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహిం చానని సీఎస్‌ తెలిపారు. 

క్షేత్రస్థాయిలో చిన్న చిన్న సమస్యలను పరిష్కరిం చేందుకు వీలుగా వారి వద్ద రూ. 25 లక్షల నిధుల ను అందుబాటులో ఉంచుతు న్నామని తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవనా ల్లో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ రూం పక్కనే స్థానిక సంస్థల అదనపు కలె క్టర్‌ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అద నపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు నిరం తరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పల్లెప్రగతి పురోగతి, మొక్కల సంరక్షణ వంటి వాటిని పరిశీలించాలని, అవసర మైన గ్రామాల్లో పల్లెనిద్ర చేసి సమస్యలు తెలుసు కోవాలని సీఎస్‌ ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు ప్రతిమాసం కనీసం 25 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సీఎం భావిస్తు న్నారని సీఎస్‌ తెలిపారు. పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపాలిటీల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పట్టణ స్థానిక సంస్థల్లో నాటిన మొక్కలను ఫారెస్టు అధికా రులు సర్టిఫై చేయాలని తెలిపారు. పట్టణాల్లో ఉండే ప్రతి ప్రభుత్వ సంస్థ, కార్యాలయం, పాఠశాల, కళాశాలల పారిశుధ్య బాధ్యత స్థానిక సంస్థలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో సైతం పల్లెప్రకృతి వనం వంటి అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి మున్సి పాలిటీలలో కేటాయిస్తున్న 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సీఎస్‌ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం 30 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. ధరణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించా లని సూచించారు. 

ప్రత్యేక ఆహార శుద్ధి కేంద్రాల స్థాపన కోసం ప్రతి జిల్లాలో 150 ఎకరాల స్థలాన్ని గుర్తించి అందిం చాలని, సదరు ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేసి భూమి వివరాలను అందించాలని సీఎస్‌ ఆదేశించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని పరిశీలిం చడానికి జూన్‌ 20 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ ఆకస్మిక పర్యటనలు ఉంటాయని సీఎస్‌ తెలిపారు. సీఎం ఆకస్మిక తనిఖీల నేపథ్యం లో అలసత్వం వహించినట్లు నిరూపితమైతే అధికా రులకు, ప్రజా ప్రతినిధులకు కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందని, అధికారులందరూ అప్రమ త్తంగా ఉండాలని సీఎస్‌ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్‌ కె శశాంక, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా, జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీలత, మున్సిపల్‌, ఫారెస్టు సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

Follow Us on: