సమస్యల గుర్తింపు కోసమే పల్లె నిద్ర : జడ్పీ సీఈవో

ABN , First Publish Date - 2021-06-20T04:48:55+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమం గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గా లు ఎంచుకోవడం కోసమే అని జడ్పీ సీఈవో ఉష పేర్కొన్నారు.

సమస్యల గుర్తింపు కోసమే పల్లె నిద్ర : జడ్పీ సీఈవో
మేడిపూర్‌లో సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జడ్పీ సీఈవో ఉష

తాడూరు, జూన్‌ 19: ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా  నిర్వహిస్తున్న పల్లెనిద్ర కార్యక్రమం గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిశీలించి పరిష్కార మార్గా లు ఎంచుకోవడం కోసమే అని జడ్పీ సీఈవో ఉష పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా శనివా రం మండలంలోని మేడిపూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ పల్లె ప్రగతి పథకంలో భాగంగా నిర్వహించిన పనులతోపాటు ఇంకా ఏమైనా సమస్యలుంటే గ్రామంలో ఉన్న అ న్ని వీధులను పరిశీలించి సమస్యలను గుర్తించి  పరిష్కరించడం కోసమే పల్లె నిద్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకురావడం జరిగిందన్నారు. ప్రధా నంగా పారిశుధ్యం, హరితహారం, అంతర్గత రహ దారులు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా అన్ని శాఖ లకు సంబంధించిన అధికారులు పల్లెనిద్ర కార్యక్ర మంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌తోపాటు ఎంపీడీవో గంగమోహన్‌,  అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

రాంరెడ్డిపల్లిలో..

తెలకపల్లి, జూన్‌ 19 :  పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి అధికారులు మండలం లోని రాంరెడ్డిపల్లిలో బస చేశారు. ఈ సందర్భం గా ఎంపీడీవో అజారుద్దీన్‌ మాట్లాడుతూ గ్రామం లో ఉండే సమస్యలు తెలుసుకొని ఇక్కడే పరిష్క రించడానికి పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.  కార్యక్రమంలో డీఎల్‌పీవో రామ్మోహన్‌ రావు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఏవో సందీప్‌ కు మార్‌రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

   కొండారెడ్డిపల్లిలో.. 

వంగూరు, జూన్‌19:  మండల పరిధిలోని కొండారెడ్డిపల్లిలో శనివారం అధికారులు పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో జయరావు,  జడ్పీటీసీ, ఎంపీపీ భీమమ్మ, సర్పంచ్‌ భారతమ్మ, ఏఈ మణిపాల్‌నాయక్‌, ఏఓ తనూజ  ఉన్నారు.

Updated Date - 2021-06-20T04:48:55+05:30 IST