ఐసీజేలో విచారణకు రష్యా దూరం

ABN , First Publish Date - 2022-03-07T21:09:24+05:30 IST

రష్యా తమ దేశంపై చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఉక్రెయిన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత నెలలో నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు నెదర్లాండ్స్‌లోని ఐసీజే (పీస్ ప్యాలెస్)లో విచారణ జరుగుతోంది.

ఐసీజేలో విచారణకు రష్యా దూరం

రష్యా తమ దేశంపై చేస్తున్న దాడిని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఉక్రెయిన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గత నెలలో నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు నెదర్లాండ్స్‌లోని ఐసీజే (పీస్ ప్యాలెస్)లో విచారణ జరుగుతోంది. అయితే, ఈ విచారణకు హాజరుకాకూడదని రష్యా నిర్ణయించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తమ దేశం తరఫున ప్రతినిధి ఉండబోరని రష్యా ప్రకటించింది. కేసు విచారణలో భాగంగా తమ దేశంపై రష్యా దాడి ఆపేలా తక్షణం ఆదేశాలివ్వాలని ఉక్రెయిన్ కోరుతోంది. ‘ప్రస్తుతం మేం పీస్ ప్యాలెస్‌లో ఉన్నాం. అక్కడ మా దేశంపై రష్యా బాంబులు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. లక్షలాది ఉక్రెయిన్ ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పటికే మా దేశం నుంచి 15 లక్షల మందికిపైగా వలస వెళ్లారు. మరింతమంది నిరాశ్రయులయ్యారు. మా ప్రజలకు వైద్య సేవలు కూడా అందించలేకపోతున్నాం. రష్యా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి మాపై దాడి చేస్తోంది. అయితే, మాకు ఈ చట్టాలపై గౌరవం ఉంది’ అని ఉక్రెయిన్ ప్రతినిధి ఐసీజేలో వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-07T21:09:24+05:30 IST