ఉక్రెయిన్ సైనిక స్థావరాన్ని ఆక్రమించిన రష్యా

ABN , First Publish Date - 2022-03-08T17:14:31+05:30 IST

ఉక్రెయిన్ దేశంలోని ఓ సైనిక స్థావరాన్ని రష్యా మంగళవారం స్వాధీనం చేసుకుంది...

ఉక్రెయిన్ సైనిక స్థావరాన్ని ఆక్రమించిన రష్యా

కైవ్ (ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంలోని ఓ సైనిక స్థావరాన్ని రష్యా మంగళవారం స్వాధీనం చేసుకుంది.ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడి చేస్తున్న రష్యా ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని పాడుబడిన సైనిక స్థావరాన్ని ఆక్రమించింది. ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని బెర్డియాన్స్క్ శివార్లలో సైనిక పరికరాలు, ఫిరంగులు, ఇంధన డిపోలతో కూడిన సైనిక స్థావరాన్ని ఉక్రేనియన్ భద్రతా దళాలు విడిచిపెట్టాయి. దీంతో రష్యా సైనికులు ఉక్రెయిన్ సైనిక స్థావరాన్ని ఆక్రమించారని సాక్షులు పేర్కొన్నారు.ఈ సైనిక స్థావరంలో నైట్ నిఘా పరికరాలు, ఆర్టిలరీ నిఘా సముదాయం, సాయుధ వాహనాలు, ఇతర సైనిక పరికరాలను రష్యా సైనికులు స్వాధీనం చేసుకున్నారు.మరో 26 ఉక్రెయిన్ సైనిక నిర్మాణాలు తమ వైమానిక దాడుల్లో ధ్వంసమైనట్లు రష్యా పేర్కొంది.


ఉక్రెయిన్ సైనిక మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా ఏరోస్పేస్ ఫోర్సెస్ ఏవియేషన్ 26 సైనిక నిర్మాణాలను ధ్వంసం చేసిందని రష్యన్ ఫెడరేషన్ కు చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.


Updated Date - 2022-03-08T17:14:31+05:30 IST