విద్యార్థులను తరలించేందుకు సాయపడతాం: రష్యా

ABN , First Publish Date - 2022-03-05T20:09:09+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించడంలో సాయపడతామని రష్యా ప్రకటించింది. తమను రక్షించాలంటూ భారతీయ విద్యార్థులు వేడుకుంటున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన నేపథ్యంలో ఈ అంశంపై రష్యా స్పందించింది.

విద్యార్థులను తరలించేందుకు సాయపడతాం: రష్యా

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తరలించడంలో సాయపడతామని రష్యా ప్రకటించింది. తమను రక్షించాలంటూ భారతీయ విద్యార్థులు వేడుకుంటున్న వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన నేపథ్యంలో ఈ అంశంపై రష్యా స్పందించింది. భారతీయులతోపాటు విదేశీయులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా చెప్పింది. భారతీయులు, ఇతర దేశీయుల కోసం తమ దేశంలోని బెల్గారాడ్ ప్రాంతం నుంచి 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఖార్కోవ్, సుమీతోపాటు ఇతర ప్రాంతాలనుంచి అందరినీ తరలిస్తామని, మార్గమధ్యంలో ప్రత్యేక చెక్‌పాయింట్లు ఏర్పాటు చేసి, తాత్కాలిక వసతి కూడా కల్పిస్తున్నట్లు రష్యా చెప్పింది. నీరు, ఆహారం, మందులు వంటివి కూడా అందిస్తామని తెలిపింది. విదేశీయుల్ని ప్రత్యేక ఎయిర్‌బేస్‌కు తరలించి, అక్కడ్నుంచి వాయుమార్గంలో తమ దేశాలకు వెళ్లే ఏర్పాట్లు చేస్తామని రష్యా వెల్లడించింది. మరోవైపు విదేశీయుల్ని ఉక్రెయిన్ బంధీలుగా చేసుకుంటోందని రష్యా విమర్శించింది. 

Updated Date - 2022-03-05T20:09:09+05:30 IST