ఉక్రెయిన్‌పై తీవ్ర దాడులకు రష్యా ఆదేశం

ABN , First Publish Date - 2022-02-28T00:01:57+05:30 IST

ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ప్రతినిధి బృందం బెలారస్ వెళ్ళినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైన తర్వాత చర్చలకు సిద్ధమవడం..

ఉక్రెయిన్‌పై తీవ్ర దాడులకు రష్యా ఆదేశం

మాస్కో: చర్చల కోసం పంపిన ఆహ్వానాన్ని తిరస్కరించిన ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి రష్యా సిద్ధమవుతోంది. ఉక్రెయిన్‌పై దాడులు మరింత తీవ్రతరం చేయాలని రష్యా సైన్యానికి అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి దాడి చేయాలని, చర్చలకు రానందుకు ఉక్రెయిన్‌ను సమాధానం చెప్పాలనే యోచనలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు రష్యా ప్రతినిధి బృందం బెలారస్ వెళ్ళినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఆదివారం తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైన తర్వాత చర్చలకు సిద్ధమవడం ఇదే మొదటిసారి. అయితే రష్యాతో బెలారస్‌లో చర్చలు జరిపేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తిరస్కరించారు. తమ దేశంపై రష్యా జరుపుతున్న దాడుల్లో కొన్ని బెలారస్ గడ్డపై నుంచి జరుగుతున్నాయన్నారు. ఉక్రెయిన్‌పై దూకుడు స్వభావం ప్రదర్శించని ప్రాంతంలో మాత్రమే చర్చలు జరపడానికి వస్తామని చెప్పారు.

Updated Date - 2022-02-28T00:01:57+05:30 IST