మరియుపోల్‌కు విముక్తి కల్పించాం : పుతిన్
ABN , First Publish Date - 2022-04-21T20:44:52+05:30 IST
ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరానికి విజయవంతంగా విముక్తి
మాస్కో : ఉక్రెయిన్‌లోని మరియుపోల్ నగరానికి విజయవంతంగా విముక్తి కల్పించామని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ గురువారం ప్రకటించారు. నగరంలోని అజోవ్‌స్టల్ ఉక్కు కర్మాగారంలోకి వెళ్లొద్దని రష్యన్ దళాలను ఆదేశించారు. అయితే అక్కడి నుంచి ఎవరూ తప్పించుకోకుండా చూడాలని తెలిపారు.
అంతకుముందు రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు మాట్లాడుతూ, అజొవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరియుపోల్ నగరం రష్యా నియంత్రణలో ఉందని తెలిపింది. ఈ స్టీల్ ప్లాంట్‌లో ఉక్రెయిన్ సైనికులు ఉన్నారు. ఈ పారిశ్రామిక వాడను దిగ్బంధనం చేయాలని, కనీసం ఈగ అయినా బయటికి వెళ్ళకుండా చూడాలని పుతిన్ ఆదేశించారు.
ఈ స్టీల్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకోకపోతే మరియుపోల్ తమ నియంత్రణలో ఉందని చెప్పడం రష్యాకు సాధ్యం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం చాలా ఉంది. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పటి నుంచి మరియుపోల్ నగరం అనేక నష్టాలను చవి చూసింది.