రష్యా మరో సంచలనం.. ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకూ..

ABN , First Publish Date - 2021-04-01T01:07:09+05:30 IST

ప్రపంచ దేశాలకంటే ముందుగా కరోనా టీకాను ప్రజావినియోగానికి అనుమతించిన రష్యా తాజాగా మరో సంచలనానికి తెరలేపింది.

రష్యా మరో సంచలనం.. ప్రపంచంలోనే తొలిసారిగా జంతువులకూ..

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకంటే ముందుగా కరోనా టీకాను ప్రజావినియోగానికి అనుమతించిన రష్యా తాజాగా మరో సంచలనానికి తెరలేపింది. ప్రపంచంలోనే తొలిసారిగా జంతువుల కోసం ఉద్దేశించిన కరోనా టీకాను రిజిస్టర్ చేసింది. కార్నికావ్-కొవ్ పేరిట ప్రవేశపెట్టిన ఈ టీకాను ఏప్రిల్ 1 నుంచి పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్టు సమాచారం. జంతువుల నుంచి మనుషులకు కరోనా వ్యాపించవచ్చంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే ఆందోళన వ్యక్తం చేసింది. ఇలా పలు మార్లు జంతువులు, మనుషులు కరోనా బారిన పడటం ద్వారా వైరస్‌లో జన్యుమార్పులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. టీకాతో ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చేయవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో రష్యా ప్రభుత్వ ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

Updated Date - 2021-04-01T01:07:09+05:30 IST