రష్యా అపరకుబేరుడికి భారీ షాకిచ్చిన ఇటలీ..!

ABN , First Publish Date - 2022-03-20T03:12:19+05:30 IST

నాటో దేశాలు, అమెరికా విధిస్తున్న ఆంక్షల కారణంగా రష్యా ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. రష్యా ఆస్తులను వివిధ దేశాల ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటూ రష్యాకు చుక్కలు చూపిస్తున్నాయి.

రష్యా అపరకుబేరుడికి భారీ షాకిచ్చిన ఇటలీ..!

ఎన్నారై డెస్క్: నాటో దేశాలు, అమెరికా విధిస్తున్న ఆంక్షల కారణంగా రష్యా ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. రష్యా ఆస్తులను వివిధ దేశాల ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటూ రష్యాకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా ఇటలీ ప్రభుత్వం రష్యా అపరకుబేరుడు అలెక్సీ మార్డషావ్‌కు చెందిన ఓ భారీ భవంతిని జప్తు చేసింది. మెడిటరేనియన్ ద్వీపమైన సార్డీనియాలో ఈ భవంతి ఉంది. దీని ఖరీదు ఏకంగా 116 మిలియన్ డాలర్లని సమాచారం. కాగా..ఈ నెల మొదట్లోనే అలెక్సీకి చెందిన మరో లగ్జరీ యాట్‌ను కూడా ఇటలీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. లేడీ ఎమ్ అనే పేరున్న ఈ యాట్ ఖరీదు 71 మిలియన్ డాలర్లు. కాగా... అలెక్సీ మార్డషావ్‌కు రష్యాలోనే అత్యంత ధనవంతుడిగా పేరుంది. 

Updated Date - 2022-03-20T03:12:19+05:30 IST