ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి

ABN , First Publish Date - 2022-01-27T10:51:30+05:30 IST

ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఫిబ్రవరిలో మిలిటరీ దాడులు చేయబోతున్నాడని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వెండీ షేర్‌మన్‌ తెలిపారు...

ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి

  • అమెరికా అంచనా


ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఫిబ్రవరిలో మిలిటరీ దాడులు చేయబోతున్నాడని అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ వెండీ షేర్‌మన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ ప్రపంచ పరిణామాల్లో భారీ మార్పులకు కారణం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌పై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారంటూ ఆరోపిస్తూ అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా వ్యక్తిగత ఆంక్షలు విధించడాన్ని రష్యా ఖండించింది. అంతర్జాతీయంగా ఇలాంటి చర్యలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తా్యని క్రెమ్లిన్ హెచ్చరించింది.

Updated Date - 2022-01-27T10:51:30+05:30 IST