రష్యాపై దాడులు.. ఉక్రెయిన్‌కు రష్యా హెచ్చరికలు

ABN , First Publish Date - 2022-04-15T23:54:17+05:30 IST

రష్యా సరిహద్దు బ్రైయాన్‌స్క్ రీజియన్‌లోని ఓ గ్రామంపై ఉక్రెయిన్ హెలికాప్టర్‌లు బాంబులు విడిచాయని రష్యా గురువారం ప్రకటించింది. ఈ ఘటన అనంతరం అదే రోజు అర్థరాత్రి కీవ్ శివార్లలో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీ మీద మిసైల్స్‌తో దాడికి దిగినట్లు రష్యా..

రష్యాపై దాడులు.. ఉక్రెయిన్‌కు రష్యా హెచ్చరికలు

మాస్కో: రష్యా చేస్తున్న దాడులను నిలువరించడం నుంచి రష్యాపై దాడులకు పాల్పడే వరకు వచ్చింది ఉక్రెయిన్. పరోక్షంగా ఈ విషయాన్ని రష్యానే వెల్లడించడం గమనార్హం. యాబై రోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో గత రెండు రోజులుగా తమ భూభాగంలోని గ్రామాలపై ఉక్రెయిన్‌ దాడి చేస్తోందని రష్యా వ్యాఖ్యానించింది. ఉక్రెయిన్ దాడుల్ని ఖండిస్తున్న ప్రకటించిన రష్యా.. తమ భూభాగంలో తీవ్రవాద దాడులు లేదంటే విధ్వంసానికి పాల్పడితే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై తమ మిసైళ్ల దాడుల సంఖ్య పెరుగుతుందని హెచ్చరించింది.


రష్యా సరిహద్దు బ్రైయాన్‌స్క్ రీజియన్‌లోని ఓ గ్రామంపై ఉక్రెయిన్ హెలికాప్టర్‌లు బాంబులు విడిచాయని రష్యా గురువారం ప్రకటించింది. ఈ ఘటన అనంతరం అదే రోజు అర్థరాత్రి కీవ్ శివార్లలో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీ మీద మిసైల్స్‌తో దాడికి దిగినట్లు రష్యా తెలిపింది. అయితే రష్యా చేస్తున్న ప్రకటనలు అవాస్తవమని ఉక్రెయిన్ అంటోంది. అవి కేవలం ఆరోపణలు మాత్రమేనని ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు శుక్రవారం పేర్కొన్నారు.

Updated Date - 2022-04-15T23:54:17+05:30 IST