ఎంత ధ్వంసమైందో అంత రష్యానే నిర్మిస్తుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-03-04T00:39:58+05:30 IST

మేము రష్యాకు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాం. కూలి పోయిన ప్రతి ఇంటిని, ధ్వంసమైన ప్రతి వీధిని, నష్టపోయిన ప్రతి నగరాన్ని, తిరగబడ్డ ప్రతి రోడ్డుని రష్యానే తిరిగి నిర్మిస్తుంది. విరాళం, నష్టపరిహారం లాంటి పదాలు ఏవైనా కావచ్చు..

ఎంత ధ్వంసమైందో అంత రష్యానే నిర్మిస్తుంది: ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్: ఉక్రెయిన్‌పై దాడి చేసి అనేక ప్రాంతాలను ధ్వంసం చేసిన రష్యా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంటుందని, ధ్వంసం చేసిన అన్నింటినీ దగ్గరుండి నిర్మిస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు. ఈ యుద్ధం వల్ల కొంత స్వేచ్ఛ తప్ప ఇంకేమీ నష్టపోవడం లేదని దేశ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్‌ రక్షణ సహాయం తీసుకుంటోందని జెలెన్‌స్కీ వెల్లడించారు.


గురువారం జెలెన్‌స్కీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ‘‘మేము రష్యాకు ఒక విషయం స్పష్టం చేయాలనుకుంటున్నాం. కూలి పోయిన ప్రతి ఇంటిని, ధ్వంసమైన ప్రతి వీధిని, నష్టపోయిన ప్రతి నగరాన్ని, తిరగబడ్డ ప్రతి రోడ్డుని రష్యానే తిరిగి నిర్మిస్తుంది. విరాళం, నష్టపరిహారం లాంటి పదాలు ఏవైనా కావచ్చు. కానీ ఉక్రెయిన్‌లో మీరు (రష్యా) చేసిన విధ్వంసం, నష్టానికి మీరే మూల్యం చెల్లిస్తారు. ధ్వంసమైన ప్రతిదాన్ని మీరే తిరిగి నిర్మిస్తారు’’ అని జెలెన్‌స్కీ అన్నారు.


ఉక్రెయిన్‌లో ఎనిమిదో రోజు రష్యా విజృంభన కొనసాగుతోంది. అయినా ఇప్పటికీ ఉక్రెయిన్‌పై రష్యా సేనలు పట్టు సాధించలేదు. ఇప్పటికే రష్యా విదేశాంగ మంత్రి ‘న్యూక్లియర్’ హెచ్చరికలు చేశారు. యుద్ధం మధ్యలో ఒకసారి ఉక్రెయిన్‌-రష్య మధ్య జరిగిన చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. కాగా, చర్చలకు సిద్ధమని రష్యా గురువారం మరోసారి ప్రకటించింది.

Updated Date - 2022-03-04T00:39:58+05:30 IST