Ukraineలో వాక్యూమ్ బాంబులు వేశాం...రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ధృవీకరణ

ABN , First Publish Date - 2022-03-11T14:07:42+05:30 IST

ఉక్రెయిన్ దేశంపై తాము వాక్యూమ్ బాంబులు వేసింది వాస్తవమేనని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ధృవీకరించింది....

Ukraineలో వాక్యూమ్ బాంబులు వేశాం...రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ధృవీకరణ

మాస్కో(రష్యా): ఉక్రెయిన్ దేశంపై తాము వాక్యూమ్ బాంబులు వేసింది వాస్తవమేనని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. ఉక్రెయిన్ దేశంపై సైనిక దాడిలో భాగంగా తాము టీఓఎస్-1 ఏ థర్మో బారిక్ రాకెట్లను ఉపయోగించామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. వాక్యూమ్ బాంబ్ లేదా థర్మోబారిక్ ఆయుధ అధిక ఉష్ణోగ్రత విస్పోటనాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఈ వాక్యూమ్ బాంబ్ చుట్టుపక్కల ఉన్న గాలి నుంచి ఆక్సిజన్ ను పీల్చుకుంటుందని రష్యా తెలిపింది. ఈ వాక్యూమ్ బాంబ్ సాధారణ సంప్రదాయక పేలుడు పదార్థం కంటే చాలా ఎక్కువ వ్యవధిలో పేలుడు తరంగాలను ఉత్పత్తి చేస్తుందని, ఈ బాంబ్ వల్ల మానవశరీరాలు ఆవిరి అయ్యే సామర్థ్యం ఉందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వివరించింది. 


Updated Date - 2022-03-11T14:07:42+05:30 IST