
కీవ్: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యన్ సేనలు రోజురోజుకు చెలరేగిపోతున్నాయి. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు తాగా మరియుపోల్ తూర్పు శివారు ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ నగరంలో 4.30 లక్షల మంది నివసిస్తున్నారు.
వ్యూహాత్మక ఓడరేవు నగరమైన దీనిని నియంత్రణలోకి తీసుకోవాలని రష్యా తొలి నుంచీ భావిస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఇప్పుడు దీనిని స్వాధీనం చేసుకుంది. గత వారం రోజులుగా ఈ నగరంలో విద్యుత్ సరఫరా, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రష్యా సేనల దురాక్రమణ కారణంగా నగరంలో ఇప్పటికే 1,582 మంది చనిపోయినట్టు మరియుపోల్ మేయర్ కార్యాలయం పేర్కొంది. చనిపోయిన వారిని ఖననం కూడా చేయడం లేదని తెలిపింది.
ఇవి కూడా చదవండి