గోవాలో 12 ఏళ్ల రష్యన్ బాలికపై దారుణం.. తల్లి మార్కెట్‌కి వెళ్లింది గమనించి..

Published: Thu, 12 May 2022 17:09:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గోవాలో 12 ఏళ్ల రష్యన్ బాలికపై దారుణం.. తల్లి మార్కెట్‌కి వెళ్లింది గమనించి..

పనాజీ : రష్యాకు చెందిన 12 ఏళ్ల బాలికపై గోవాలో అత్యాచారం జరిగింది. ఉత్తర గోవాలోని అరంబోల్‌లో ఓ రిసార్ట్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. రిసార్ట్‌‌లో రూం అటెండెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. కర్ణాటకకు చెందిన నిందితుడిని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు పెర్నెం స్టేషన్‌ పోలీసు బృందం వెల్లడించింది. 28 ఏళ్ల నిందితుడి పేరు రవి లమానీ వివాహితుడని, మే 10న అరెస్ట్ చేసినట్టు పోలీసులు వివరించారు. మే 6న అత్యాచారానికి పాల్పడ్డాడని వివరించారు. బాలిక తల్లి మే 9న తమకు ఫిర్యాదు చేసిందని వివరించారు.


పెర్నెం పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ విక్రమ్ నాయక్ మాట్లాడుతూ.. రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న బాలికపై నిందితుడు తొలుత లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆ తర్వాత రిసార్ట్ రూంలో అత్యాచారానికి ఒడిగట్టాడని వివరించారు. బాలిక తల్లి సమీపంలోని మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఈ నేరానికి పాల్పడ్డాడు. బాలిక స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నప్పుడు తల్లి మార్కెట్‌కు వెళ్లడాన్ని గమనించి ఈ దురాగతానికి పాల్పడ్డాడని ఆయన చెప్పారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఫిర్యాదు అందుకున్న 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. పోస్కోతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని వివరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

క్రైమ్ Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.