ఖార్కివ్‌లో రష్యా పారాట్రూపర్లు..దాడి తీవ్రం

ABN , First Publish Date - 2022-03-02T19:07:13+05:30 IST

లారస్‌లో ఓవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య రెండో దఫా శాంతి చర్చలు బుధవారం జరగాల్సి ఉండగా, ఉక్రెయిన్‌ రాజధాని..

ఖార్కివ్‌లో రష్యా పారాట్రూపర్లు..దాడి తీవ్రం

ఖార్గివ్: బెలారస్‌లో ఓవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య రెండో దఫా శాంతి చర్చలు బుధవారం జరగాల్సి ఉండగా, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ సహా రెండో పెద్ద నగరమైన ఖార్కివ్‌లో భారీగా రష్యా పారామిలటరీ బలగాలు దిగాయి. దాడిని తీవ్రం చేశాయి. రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తుండటంతో డజన్ల కొద్దీ పౌరులు మరణిస్తున్నట్టు బీబీసీ న్యూస్ సర్వీ‌స్ తెలిపింది. ఖార్కివ్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిర్ రైడ్ సైరెన్లు మోగిన కొద్ది సేపటికే గగనతల దాడులు మొదలయ్యాయని, రష్యా బలగాలు ఒక ప్రాంతీయ మిలటరీ ఆసుపత్రిలో దాడి చేశాయని ఆ వార్తా సంస్థ పేర్కొంది. గత 24 గంటల్లో 21 మంది మరణించగా, 112 మంది గాయపడ్డారని రీజినల్ గవర్నల్ ఒలెగ్ సినెగుబోవ్ బుధవారం తెలిపారు. నివాస ప్రాంతాలతో పాటు, ప్రాంతీయ అడ్మినిస్ట్రేషన్ భవంతులపై కూడా క్షిపణులు దాడులు సాగుతున్నట్టు చెప్పారు.


ఖార్కివ్‌లోని స్థానిక ప్రభుత్వ కార్యాలయంపై మంగళవారంనాడు క్షిపణి దాడి జరగడంతో మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయని, సమీపంలోని కార్లు, భవంతులు తగులబడ్డాయని ఉక్రెయిన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిని యుద్ధనేరంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెబుతున్నారు. కాగా, రాజధాని కీవ్ నగరాన్ని పట్టుకునేందుకు దండులా కదిలివస్తున్న రష్యా సాయుధ బలగాలు, భారీ వాహన శ్రేణి కీవ్‌కు 15 మైళ్ల దూరంలో ఉన్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2022-03-02T19:07:13+05:30 IST