రైతుబంధు డబ్బులు తక్షణమే అందజేయాలి

ABN , First Publish Date - 2022-07-04T05:30:00+05:30 IST

Rythu Bandhu's money should be handed over immediately

రైతుబంధు డబ్బులు తక్షణమే అందజేయాలి
మాట్లాడుతున్న వంశీకృష్ణ

- డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ


మన్ననూర్‌, జూలై 4: c సోమవారం మం డల కేంద్రంలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి విచ్చేసిన వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న రైతుబంధు డబ్బులను బ్యాంక్‌ అధికారులు హోల్డ్‌లో పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతకానితనానికి నిదర్శనమని, వర్షాలు లేక రైతు లు అవస్థలు పడుతుంటే బ్యాంక్‌ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం చాలా హేయమైన చర్య అని ఆరోపించారు. వానాకాలం సీజన్‌ ప్రారంభం కాగానే రై తులు పెట్టుబడి కోసం నానా ఇబ్బందులు పడుతున్నారని, అరకొరగా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవి కూడా ఈ బ్యాంక్‌ అధికారులు హోల్డ్‌లో పెట్టి ప్రజలను ఇబ్బందుల కు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వెంటనే హోల్డ్‌లో నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తామని గతంలో రెండుసార్లు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఏ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగలేదని పే ర్కొన్నారు. రైతుల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ రైతులను ప్రజలను ఇబ్బందులు గురి చేస్తున్నాయ ని, బ్యాంక్‌ అధికారులు వెంటనే రైతుల ఒక్క ఖా తాను హోల్డ్‌ నుంచి తీసివేయాలని కాంగ్రెస్‌ తరపున డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. అనంతరం బ్యాంక్‌ మేనేజర్‌ కు వినతి పత్రం అందజేశారు. అలాగే మన్ననూర్‌ బ్యాంక్‌ మేనేజర్‌తో మాట్లాడి హోల్డింగ్‌లో పెట్టిన రైతుల ఖాతాలను వెంటనే ప్రారంభించి వారికి ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు నిధులను అందజేయాలని కోరారు. అమ్రా బాద్‌ ఎంపీపీ శ్రీనివాసులు, ఎంపీటీసీ దాసరి శ్రీనివాసులు, కోఆప్షన్‌ సభ్యుడు రహీం, బాలింగంగౌడ్‌, హరినారాయణగౌడ్‌, సంబు వెంకటరమణ, కుందా మల్లికార్జున్‌, లింగం, అంజమ్మ, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు సంతోష్‌, గెలవయ్య, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T05:30:00+05:30 IST